Scary Video: ఆకలి మీదున్న సింహం వేట.. లైవ్‌లో వీక్షించిన పర్యాటకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

అడవికి 'రాజు' సింహం. ఇది జగమెరిగిన సత్యం. దాని వేట ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అందుకు సంబంధించిన పలు వీడియోలు..

Scary Video: ఆకలి మీదున్న సింహం వేట.. లైవ్‌లో వీక్షించిన పర్యాటకులు.. చివరికి ఏం జరిగిందంటే.!
Lion Prey
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 17, 2021 | 7:06 PM

అడవికి ‘రాజు’ సింహం. ఇది జగమెరిగిన సత్యం. దాని వేట ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చక్కర్లు కొడుతుంటాయి. వాటిని నెటిజన్లు చూసి ఆశ్యర్యపోతుంటారు. సరిగ్గా ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జంగిల్ సఫారీలో కొంతమంది పర్యాటకులు సింహం వేటను లైవ్‌లో చూసి అవాక్కయ్యారు. ఆ వీడియో చూసిన తర్వాత మీ రోమాలు కూడా ఖచ్చితంగా నిక్కపొడుచుకుంటాయి.

ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో అనేక రకాల జంతువుల వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్‌గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసిన వీడియో విషయానికి వస్తే.. సఫారీ అడవిలో కొంతమంది పర్యాటకులు ఓ జీప్‌లో చుట్టూ చూస్తుండగా.. వారి ముందు నుంచే ఆకలి మీదున్న ఓ సింహం తన ఎరను వేటాడుతుంది. ఆ సమయంలో కొంతమంది ఈ దృశ్యాలను తమ కెమెరాలలో బంధించగా.. మరికొందరు షాక్‌కు గురయ్యారు. అంతేకాకుండా సింహం వేటాడే సమయంలో ఆ జీప్‌లోని వ్యక్తులు భయపడుతున్న దృశ్యాలను మనం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.

షాకింగ్ వీడియో.. నెట్టింట్లో వైరల్..

ఈ ప్రమాదకరమైన వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్‌లలో హల్చల్ చేస్తోంది. దీనిని ‘సనాడే’ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఈ వీడియోను 2.5 మిలియన్ల మంది చూశారు. అదే సమయంలో, 60 వేల మంది లైక్ చేశారు. అంతేకాకుండా కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

Also Read:

ఆ వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు ఎక్కువ.. తస్మాత్ జాగ్రత్త.! హెచ్చరిస్తున్న వైద్యులు..

మద్యం సేవిస్తే కరోనా వైరస్ తగ్గుతుందా.? అపోహలు.. నిజాలు.! వివరాలివే..

కూరగాయలు సర్దుతుండగా భార్యాభర్తలకు ఊహించని షాక్.. పాలకూర‌లో నక్కిన పాము.. భయానక వీడియో.!