భూమిలో తెల్లని ‘లోదుస్తులను’ పాతిపెడుతున్న ప్రజలు.. అసలు రహస్యం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.?

భూమిలో తెల్లని 'లోదుస్తులను' పాతిపెడుతున్న ప్రజలు.. అసలు రహస్యం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.?
Underwears Buried

అక్కడి ప్రజలు లోదుస్తులను భూమిలో పాతిపెట్టారట.! అదేమైనా ఆచారమా.? లేక సంప్రదాయమా.? అని అనుకుంటే పొరపాటే.. ఇలా చేయడం వెనుక...

Ravi Kiran

|

Apr 17, 2021 | 6:57 PM

అక్కడి ప్రజలు లోదుస్తులను భూమిలో పాతిపెట్టారట.! అదేమైనా ఆచారమా.? లేక సంప్రదాయమా.? అని అనుకుంటే పొరపాటే.. ఇలా చేయడం వెనుక బలమైన కారణం ఉంది. ఆ విషయాన్ని తెలుసుకుంటే మీరు కూడా ఆసక్తిని కనబరుస్తారు. అవునండీ.. ఇది నిజం.. ఈ తరహా చిత్రమైన విషయాలు స్విట్జర్లాండ్‌లో జరుగుతున్నాయి. అక్కడి పొలాల యజమానులు మట్టి నాణ్యతను తెలుసుకునేందుకు తెల్లని లోదుస్తులను భూమిలో పాతిపెడుతున్నారు.

ఈ అధ్యయనం స్టేట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అగ్రోస్కోప్ చేపడుతోంది. పరిశోధనల్లో పాల్గొన్న వాలంటీర్లకు రెండు తెల్లటి కాటన్ లోదుస్తులను మట్టిలో పూడ్చిపెట్టేందుకు పంపిస్తోంది. ఆ తర్వాత ఈ లోదుస్తులను సూక్ష్మజీవులు ఎంతలా నాశనం చేశాయన్న దానిని పరిశీలిస్తోంది. ఈ లోదుస్తులను పూడ్చిపెట్టిన రోజు నుంచి కొన్ని నెలల వ్యవధి తర్వాత బయటికి తీసి.. జూరిచ్ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు వాటిని పరిశీలిస్తారు. ఏయే సూక్ష్మజీవులు ఈ లోదుస్తులను నాశనం చేశాయో తెలుసుకునేందుకు వాటిపై డీఎన్‌ఏ జాడల గుర్తించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు.

పరిశోధనలో భాగమే లోదుస్తులను పాతిపెట్టడం…

ఈ ప్రాజెక్టు హెడ్ మార్సెల్ మాట్లాడుతూ.. నేల నాణ్యతను తెలుసుకునేందుకే ఈ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నామని.. లోదుస్తులను గడ్డి మైదానాలు, పొలాలు, చెట్ల కింద పూడ్చిపెడతామని అన్నారు. ఈ ప్రయోగంలో భాగంగా మొదటిసారి మట్టి నుండి లోదుస్తులను తీసి వాటి ఫోటోలను తీస్తాం. ఆ తర్వాత నెల తర్వాత మరోసారి లోదుస్తులను బయటకు తీసి పరీక్షిస్తాం. లోదుస్తులపై ఎక్కువగా రంధ్రాలు ఉంటే, నేల ఆరోగ్యంగా ఉందని అర్థం అని చెప్పుకొచ్చారు.

Also Read:

ఆ వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు ఎక్కువ.. తస్మాత్ జాగ్రత్త.! హెచ్చరిస్తున్న వైద్యులు..

మద్యం సేవిస్తే కరోనా వైరస్ తగ్గుతుందా.? అపోహలు.. నిజాలు.! వివరాలివే..

కూరగాయలు సర్దుతుండగా భార్యాభర్తలకు ఊహించని షాక్.. పాలకూర‌లో నక్కిన పాము.. భయానక వీడియో.!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu