కుటుంబాన్ని తుడిచిపెట్టేసిన కరోనా.. 15 రోజుల్లో ఐదుగురు బలి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు.!

Corona Virus Scare: చిన్న సూక్ష్మజీవి.. పెద్ద ఫ్యామిలీని బలి తీసుకుంది. చిన్న నిర్లక్ష్యం పెద్ద విషాదాన్ని మిగిలించింది. ఒక కుటుంబమే లేకుండా చేసింది.

కుటుంబాన్ని తుడిచిపెట్టేసిన కరోనా.. 15 రోజుల్లో ఐదుగురు బలి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు.!
Corona
Follow us

|

Updated on: Apr 17, 2021 | 4:10 PM

చిన్న సూక్ష్మజీవి.. పెద్ద ఫ్యామిలీని బలి తీసుకుంది. చిన్న నిర్లక్ష్యం పెద్ద విషాదాన్ని మిగిలించింది. ఒక కుటుంబమే లేకుండా చేసింది. కరోనా సృష్టిస్తున్న హారర్ ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఆ ఫ్యామిలీనే ఉదాహరణ. ఒకరి తర్వాత ఒకరు.. 15 రోజుల వ్యవధిలో ఆ కుటుంబంలోని ఐదుగురు కరోనా కారణంగా మరణించారు.

మహారాష్ట్రలోని పూణేకు చెందిన జాదవ్ కుటుంబం అంతటిని 15 రోజుల వ్యవధిలో కరోనా కబళించింది. ఇంట్లో జరిగే ఓ పూజా కార్యక్రమం కోసం కలిసిన వీరందరూ.. ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడ్డారు. మొదటిగా తల్లి ఆల్కా జాదవ్, ఆ తర్వాత సోదరుడు రోహిత్ జాదవ్, అతుల్ జాదవ్, సోదరి వైశాలి గైక్వాడ్ ఇలా కుటుంబంలోని ఐదుగురు కరోనా కాటుకు మృతి చెందారు. కరోనా బారినపడి ఈ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు 15 రోజుల వ్యవధిలో మృతి చెందటంతో అక్కడ స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

పూజకు హాజరైన జాదవ్ కుటుంబ సభ్యులు..

కొద్దిరోజుల క్రితం ఇంట్లో నిర్వహించిన ఓ పూజా కార్యక్రమానికి జాదవ్ కుటుంబసభ్యులు అందరూ కూడా ఒకే చోట కలిశారు. అదే వారికి ముప్పు తెచ్చిపెట్టింది. ఒక్కొక్కరుగా కరోనా బారిన పడ్డారు.. కేవలం 15 రోజుల వ్యవధిలో ఐదుగురు కుటుంబసభ్యులు మరణించారు.

పూణేలో కరోనా తీవ్రత భయంకరంగా ఉంది…

పూణేలో కరోనా పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరింది. అక్కడ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే, పూణేలోని అన్ని హౌసింగ్ సొసైటీలు.. అక్కడ నివసిస్తున్న వారిని తప్పితే.. బయట వ్యక్తులను లోపలికి రానివ్వట్లేదు. అలాగే, ఆర్టీపీసీఆర్ పరీక్షలు ప్రతీ ఒక్కరికి తప్పనిసరి అని పూణే మునిసిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది.

పూణేలో కఠినమైన ఆంక్షలు…

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పూణేలో ‌లాక్‌డౌన్ కఠినతరం చేశారు. కర్ఫ్యూను విచ్ఛిన్నం చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. మెడికల్ షాపుల మినహా మిగిలిన దుకాణాలు అన్నింటిని మూసివేయాలని ఆదేశించారు.

Also Read:

ఆ వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు ఎక్కువ.. తస్మాత్ జాగ్రత్త.! హెచ్చరిస్తున్న వైద్యులు..

మద్యం సేవిస్తే కరోనా వైరస్ తగ్గుతుందా.? అపోహలు.. నిజాలు.! వివరాలివే..

కూరగాయలు సర్దుతుండగా భార్యాభర్తలకు ఊహించని షాక్.. పాలకూర‌లో నక్కిన పాము.. భయానక వీడియో.!