Lalu Prasad Yadav: కింగ్ ఈజ్ బ్యాక్…పూనకంతో ఊగిపోతున్న లాలూ అభిమానులు

Lalu Prasad Yadav: పశుదాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో ఇప్పటికే మూడు కేసుల్లో లాలూకు బెయిల్ పొందారు.

Lalu Prasad Yadav: కింగ్ ఈజ్ బ్యాక్...పూనకంతో ఊగిపోతున్న లాలూ అభిమానులు
Lalu Prasad Yadav
Follow us

|

Updated on: Apr 17, 2021 | 3:28 PM

పశుదాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో ఇప్పటికే మూడు కేసుల్లో లాలూ బెయిల్ పొందారు. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ ఇవాళ లేదా రేపు జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ అభిమానులు, ఆర్జేడీ కార్యకర్తలు పూనకంతో ఊగిపోతున్నారు. షేర్ లూలూ ఆయా.. అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేయిస్తున్నారు.ఇది ఒకానొక సందర్భంలో దేశంలోనే టాప్ ట్రెండింగ్ హ్యాష్ టాగ్‌గా నిలవడం విశేషం. ఎట్టకేలకు న్యాయం జరిగింది…కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ లూలూకు బెయిల్ దక్కడంపై ఓ నెటిజన్ తన సంతోషాన్ని వ్యక్తంచేశాడు. మోదీని ఢీకొనేందుకు లాలూ లాంటి ధైర్యమున్న నాయకుడు ఇప్పుడు దేశానికి అవసరమని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.

లాలూ జైలు నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణం దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంధిపడుతుందని సోషల్ మీడియా వేదికలపై కామెంట్స్ చేస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా జైలు నుంచి బయటకు వచ్చుంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని అభిప్రాయపడుతున్నారు. సమోసాలో ఆలూ ఉన్నంత వరకు బీహార్‌లో లాలూ ఉంటారని చెబుతున్నారు. నేటి రాజకీయ నాయకుల్లో విలువలు కలిగిన నాయకుడు లాలూ ఒక్కరేనంటూ ఆయన అభిమాని ఒకరు ట్వీట్ చేశాడు.

లాలూ తనకు చిన్నప్పటి నుంచి ఎంతో నచ్చిన రాజకీయ నాయకుడని…ఆయన బెయిల్ దక్కడం సంతోషం కలిగిస్తున్నట్లు ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. లాలూకు బెయిల్ దక్కడంతో బీజేపీ గుండెలు పగిలిపోయాయంటూ ట్రోల్ చేస్తున్నారు. ఓ నెటిజన్…లాలూ ప్రసాద్ యాదవ్‌ను దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై పోరాడి 27 ఏళ్లు జైలు జీవితం అనుభవించిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాతో పోల్చడం విశేషం. అటు కొందరు నెటిజన్స్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు వ్యతిరేకంగానూ ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు.