West Bengal Assembly Election Highlights: కొనసాగుతున్న బెంగాల్ ఐదో దశ పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు..

West Bengal Assembly Election Highlights: మొత్తం 8 విడతలుగా.. సుదీర్ఘంగా సాగుతున్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

West Bengal Assembly Election Highlights: కొనసాగుతున్న బెంగాల్ ఐదో దశ పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు..
Bengal

| Edited By: Ravi Kiran

Apr 17, 2021 | 7:29 PM

West Bengal Assembly Election Highlights: మొత్తం 8 విడతలుగా.. సుదీర్ఘంగా సాగుతున్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది. మ‌ధ్యాహ్నం 1.30 గంటల వరకు 54.67 శాతం ఓటింగ్‌ జరిగింది.  తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న నియోజకవర్గాల్లో ఈ దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ ఎలాగైనా పట్టు నిలబెట్టుకోవాలని టీఎంసీ, పట్టు సాధించాలని బీజేపీ విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ప్రచారంలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా రెండు పార్టీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో ప్రచార సమయంలో తీవ్ర ఘర్షణలూ చెలరేగాయి.

కాగా, రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలకు గానూ ఇప్పటివరకు జరిగిన నాలుగు విడతలలో 135స్థానాల్లో పోలింగ్ ముగిసింది. ఇంకా పోలింగ్ జరగాల్సిన స్థానాలు 159.  ఐదో విడతలో 45 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతుంది.
ఇక పోలింగ్ జరగనున్న 45 నియోజకవర్గాలు ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. పోలింగ్ లో పాల్గొనబోయే ఓటర్లు 1.12 కోట్లు. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 15,789. 319 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా, వీరిలో మహిళా అభ్యర్థినుల సంఖ్య 39.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 17 Apr 2021 06:53 PM (IST)

  కేంద్ర దళాలు కాల్పులు జరిపాయి..!

  పశ్చిమ బెంగాల్‌లోని దేగానా అసెంబ్లీలోని కురుల్‌గచా ప్రాంతంలోని స్థానిక ప్రజలు కేంద్ర బలగాలు వైమానిక కాల్పులు జరిపారని ఆరోపించారు. వార్తా సంస్థ ANI ప్రకారం, స్థానిక వ్యక్తి మాట్లాడుతూ ” అక్కడ ఓటింగ్ యథావిధిగా జరుగుతోంది” అప్పుడే కేంద్ర దళానికి చెందిన 8-9 మంది సైనికులు వచ్చి కాల్పులు జరిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. “

 • 17 Apr 2021 06:51 PM (IST)

  సాయంత్రం 5 గంటల వరకు 78.36 శాతం ఓటింగ్

  సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 78.36 శాతం పోలింగ్ జరిగింది. జల్పాయిగురిలో 81.73 శాతం, కాలింపాంగ్‌లో 69.56, డార్జిలింగ్‌లో 78.31, ఉత్తర 24 పరగణాల్లో 78.83, తూర్పు బుర్ద్వాన్‌లో 81.72, నాడియాలో 81.57 శాతం ఉన్నాయి.

 • 17 Apr 2021 04:34 PM (IST)

  ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ మిమీ చక్రవర్తి..

  బెంగాల్ ఐదవ దశ ఓటింగ్ సందర్భంగా టీఎంసీ ఎంపీ మిమీ చక్రవర్తి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 • 17 Apr 2021 04:33 PM (IST)

  మధ్యాహ్నం 3.15 వరకు 62.40 శాతం ఓట్లు...

  మధ్యాహ్నం 3.15 గంటలకు పశ్చిమ బెంగాల్‌లో 62.40 శాతం ఓట్లు పోలయ్యాయి. ఐదవ దశకు ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

 • 17 Apr 2021 04:16 PM (IST)

  టీడీపీ నేతలపై చర్యలు తీసుకోండిః వైసీపీ

  తిరుమల దర్శనం కోసం ప్రైవేట్ బస్సుల్లో వచ్చిన భక్తులను టీడీపీ అడ్డుకుంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దొంగ ఓటర్లంటూ ఆందోళన చేస్తూ ఓటర్లను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని వైసీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

 • 17 Apr 2021 03:29 PM (IST)

  ఓటర్లను అడ్డుకుంటున్న టీఎంసీ కార్యకర్తలు..

  బియన్నగర్ నియోజకవర్గంలో టీఎంసీ-బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌లోకి వెళ్లనివ్వకుండా తనను అడ్డుకున్నారని బియన్నగర్ ప్రాంతానికి చెందిన బీజేపీ అభ్యర్థి సబ్యసాచి దత్తా ఆరోపించారు. ఓటర్లను కూడా ఓటింగ్ చేయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు.

 • 17 Apr 2021 02:58 PM (IST)

  జల్పాయిగురిలో అత్యధిక ఓటింగ్...

  పశ్చిమ బెంగాల్‌లో ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. జల్పాయిగురిలో మధ్యాహ్నం వరకు 59.57 శాతం, కాలింపాంగ్‌లో 43.28, డార్జిలింగ్‌లో 51.15, ఉత్తర 24 పరగణాలో 50.37, తూర్పు బర్ధమన్‌లో 58.20, నాడియాలో 57.72 శాతం పోలింగ్ నమోదైంది.

 • 17 Apr 2021 02:32 PM (IST)

  కొనసాగుతోన్న ఓటింగ్‌… మ‌ధ్యాహ్నం 1.30 వరకు ఎంత పోలింగ్‌ జరిగిందంటే..

  వెస్ట్ బెంగాల్‌లో 5వ విడద పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మ‌ధ్యాహ్నం 1.30 గంటల సమయానికి 54.67 శాతం ఓటింగ్‌ నమోదైంది.. ఇంకా దాదాపు 5 గంటల సమయం ఉండడంతో ఓటింగ్ శాతం మ‌రింత పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

 • 17 Apr 2021 01:31 PM (IST)

  జుంగిపూర్ నియోజకవర్గంలో వాయిదా పడ్డ పోలింగ్‌..

  ఆర్‌ఎస్‌పి అభ్యర్థి ప్రదీప్‌ కుమార్‌ నంది మృతి చెందడం వల్ల ముర్షిదాబాద్‌లోని జుంగిపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలను ఏప్రిల్‌ 26కు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయించింది.

 • 17 Apr 2021 12:23 PM (IST)

  క్రమంగా పెరుగుతోన్న ఓటింగ్… ఉదయం 11.30 వరకు ఎంత పోలింగ్‌ జరిగిందంటే..

  వెస్ట్ బెంగాల్‌లో 5వ విడద పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చెదురు మొదురు సంఘటనలు మిన‌హాయించి పోలింగ్‌ జరుగుతోంది. ఈ క్రమంలో పోలింగ్‌ క్రమంగా పెరుగుతోంది. తాజాగా 11.30 గంటల సమయానికి 36.2 శాతం ఓటింగ్‌ నమోదైంది..

 • 17 Apr 2021 11:29 AM (IST)

  పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన సిపి అజోయ్ నందా.. ఎన్నికలు శాంతియుతంగా..

  వెస్ట్‌ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా.. జరుగుతోన్న 5వ విడత పోలింగ్‌ ప్ర‌శాంతంగా కొనసాగుతున్నాయని సిపి అజోయ్‌ నందో చెప్పారు. కమర్హతి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన తరువాత సిపి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయ మాట్లాడుతూ.. ఎన్నికలు శాంతియుతంగా కొనసాగుతున్నాయని. ఎలాంటి నిర్బంధం లేని స్వేచ్ఛాయుత ఎన్నికలకు తాము భరోసా ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.

 • 17 Apr 2021 11:20 AM (IST)

  కొనసాగుతోన్న ఓటింగ్‌.. ఓటర్లకు సహాయం చేస్తున్న ఐటిబిపి సిబ్బంది..

  వెస్ట్ బెంగాల్‌లో 5వ విడత పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పోలింగ్‌ కేంద్రాలకు వస్తున్న ఓటర్లకు ఐటిబిపి సిబ్బంది సహాయం అందిస్తోంది. అనులియా, రణఘాట్, పూర్వి బర్ధామన్లలోని పోలింగ్ కేంద్రాలకు వస్తున్న ఓటర్లకు సహాయం చేస్తున్నారు.

 • 17 Apr 2021 10:33 AM (IST)

  పోలింగ్‌ కేంద్రం వద్ద ఆకస్మికంగా మరణించిన బీజేపీ పోలింగ్ ఏజెంట్‌.. నివేదిక కోరిన ఎన్నికల కమిషన్‌..

  కమర్హతిలోని బూత్ నంబర్ -107 దగ్గర బీజేపీ ఏజెంట్‌ ఆకస్మికగా మరణించాడు. అతని అభిజీత్‌ సమంత్‌ అని.. పోలింగ్‌ కేంద్రం వద్ద ఎలాంటి సాయం అందలేదని మరణించిన వ్యక్తి సోదరుడు వాపోయాడు. ఈ విషయమై ఎన్నికల సంఘం నివేదిక కోరింది.

 • 17 Apr 2021 10:04 AM (IST)

  ప్రశాంతంగా కొనసాగుతోన్న వెస్ట్‌ బెంగాల్‌ ఎన్నికలు.. 9.30 వరకు ఎంత పోలింగ్‌ అయ్యిందంటే..

  వెస్ట్‌ బెంగాల్‌ అసెంబ్లీకి జరుగుతోన్న పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా అందిన వివరాల ప్రకారం ఉదయం 9.30 వరకు 16.15 శాతం ఓటింగ్‌ జరిగింది

 • 17 Apr 2021 09:57 AM (IST)

  కేంద్ర దళాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన టీఎమ్‌సీ అభ్యర్థి మదన్‌ మిత్రా..

  టీఎమ్‌సీ అభ్యర్థి మదన్‌ మిత్రా కేంద్ర దళాలపై అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించిన మదన్‌ మిత్రాను కేంద్ర దళాలు తనిఖీ చేశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా జేబులో ఉన్నవి దేవడు చిత్రాలు.. నాకు పోలింగ్‌ బూత్‌ లోపలికి వెళ్లే హక్కు ఉంది. ఈ విషయమై ఎన్నికల కమిషనర్‌ను కలుస్తానని ఆయ తెలిపారు.

 • 17 Apr 2021 08:48 AM (IST)

  రాజధాని నగరంలో ఓటు హ‌క్కు వినియోగించుకోవడానికి బారులు తీరిన ఓటర్లు..

  వెస్ట్ బెంగాల్‌ 5వ విడత పోలింగ్ ప్ర శాంతంగా కొనసాగుతోంది. రాజధాని నగరం కోల్‌కతాలో ఓటర్లు బారులు తీరారు. ఈ క్రమంలోనే దక్షిణేశ్వర్‌లోని హిరాలాల్ మజుందార్ మెమోరియల్ కాలేజ్ ఫర్ ఉమెన్ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ వెలుపల ఓటర్లు అధిక సంఖ్యలో బారులు తీరారు.

 • 17 Apr 2021 07:58 AM (IST)

  పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తిన మహిళా ఓటర్లు..

  బెంగాల్‌ 5వ విడత పోలింగ్‌లో భాగంగా మహిళా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. సౌత్‌ బర్దామన్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరిన మహిళలనే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.

 • 17 Apr 2021 07:41 AM (IST)

  కరోనా నిబంధనల నడుమ కొనసాగుతోన్న పోలింగ్‌..

  కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో వెస్ట్‌ బెంగాల్‌ పోలింగ్‌ సందర్భంగా అధికారులు అన్ని చర్యలను పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే డార్జిలింగ్‌లోని 263 నెంబర్ పోలింగ్ బూత్‌ వద్ద కరోనా మార్గదర్శకాలను పాటిస్తున్నఅధికారులు.

 • 17 Apr 2021 07:14 AM (IST)

  మొదలైన బెంగాల్‌ ఐదో విడుత ఎన్నికల పోలింగ్..బారులు తీరిన ఓటర్లు..

  వెస్ట్‌ బెంగాల్‌ ఐదో విడత ఎన్నికల పోలింగ్‌ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. దీంతో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. బెంగాల్‌ వాసులు తమ ఓటును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 • 17 Apr 2021 07:05 AM (IST)

   ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల ముందు బారులు తీరిన ఓటర్లు..

  వెస్ట్‌ బెంగాల్‌ ఐద విడుత ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనడానికి ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. పోలింగ్‌ మొదలుకాకముందే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.

 • 17 Apr 2021 07:00 AM (IST)

  పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తోన్న సిబ్బంది..

  వెస్ట్‌ బెంగాల్‌ ఐదో విడత ఎన్నికల పోలింగ్‌ కోసం అధికారులు ఉదయం నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగాల్‌లోని బీదన్నగర్‌లోని కేంద్రంలో అధికారులు ఎన్నికల కోసం సన్నాహాలు చేస్తున్నారు.

Published On - Apr 17,2021 6:53 PM

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu