కరోనా విజ‌‌ృంభణపై అప్రమత్తమైన కేంద్రం.. మరికాసేపట్లో ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ కీలక సమావేశం

కరోనా విజ‌‌ృంభణపై అప్రమత్తమైన కేంద్రం.. మరికాసేపట్లో ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ కీలక సమావేశం
PM Narendra Modi

కోవిడ్ 19 కేసులు పెరుగుతుండ‌టంతో మ‌హ‌మ్మారి క‌ట్టడికి చేప‌ట్టాల్సిన చ‌ర్యల‌పై ప్రధాని నరేంద్ర మోదీ శ‌నివారం ప‌లు రాష్ట్రాల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు.

Balaraju Goud

|

Apr 17, 2021 | 6:55 PM

PM Narendra Modi covid 19 review:  దేశ‌వ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు పెరుగుతుండ‌టంతో మ‌హ‌మ్మారి క‌ట్టడికి చేప‌ట్టాల్సిన చ‌ర్యల‌పై ప్రధాని నరేంద్ర మోదీ శ‌నివారం ప‌లు రాష్ట్రాల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో కీల‌క స‌మావేశం నిర్వహించనున్నారు. కేసుల పెరుగుద‌లతో రాష్ట్రాలు ముందస్తు ప్రణాళిక‌ల‌తో మ‌హ‌మ్మారి క‌ట్టడికి ఆసుపత్రులు, బెడ్స్, ఆక్సిజ‌న్, వెంటిలేట‌ర్లు వంటి మౌలిక వ‌స‌తులకు సంబంధించి కీలకంగా చర్చించనున్నారు. అంతేకాకుండా దేశంలో కోవిడ్ 19 టీకా పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని మోదీ శనివారం రాత్రి 8 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు.

కేంద్ర వైద్యారోగ్య శాఖ శనివరారం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం దేశంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 2,34,692 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో మరో 1341 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. ఇందులో 1,26,71,220 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 16,79,740 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,75,649కి చేరింది. భారత దేశవ్యాప్తంగా 11,99,37,641 మందికి వ్యాక్సిన్ ను అందించారు. ఇలా రోజు రోజుకీ దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరగుతుంది.

ఇదిలావుంటే, దేశంలో మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాపై ప్రధానమంత్రి మోదీ శుక్రవారం సమగ్ర సమీక్ష చేశారు. హెల్త్, డీపీఐఐటీ, స్టీల్, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖల నుంచి ఇన్ పుట్స్ తీసుకున్నారు. ప్రస్తుత సరఫరాతో పాటు.. వచ్చే 15 రోజుల్లో వినియోగంపైనా సమీక్షించారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉందని… ఆ రాష్ట్రాలపై ఒత్తిడి ఎక్కువగా ఉందని గుర్తించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలో జిల్లా స్థాయి పరిస్థితిని అధికారులు ప్రధాని ముందు ప్రజెంట్ చేశారు. రాష్ట్రాలు, కేంద్రంతో సంప్రదింపులు జరపాలని మోదీ సూచించారు. ఈ నెల 20న 4,880 మెట్రిక్ టన్నులు, 25న 5,619 మెట్రిక్ టన్నులు, 30న 6,593 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఆ 12 రాష్ట్రాలకు కేటాయించాలని మోదీ ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా వాహనాలు దేశంలో ఎక్కడికైనా వెళ్లేలా ఉండాలని… వాటిపై ఆంక్షలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఆక్సిజన్ సిలిండర్ ఫిల్లింగ్ ప్లాంట్స్ 24గంటల పాటు పనిచేసేలా పర్మిషన్ ఇవ్వనున్నారు.

మరోవైపు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హ‌ర్షవ‌ర్ధన్ శ‌నివారం ప‌లు రాష్ట్రాల ఆరోగ్య మంత్రుల‌తో కీల‌క స‌మావేశం నిర్వహించారు. కరోనా కేసుల పెరుగుద‌లతో రాష్ట్రాలు ముందస్తు ప్రణాళిక‌ల‌తో మ‌హ‌మ్మారి క‌ట్టడికి ఆసుపత్రుల సంఖ్యను పెంచుకోవాలని అదనపు బెడ్స్, ఆక్సిజ‌న్, వెంటిలేట‌ర్లు వంటి మౌలిక వ‌స‌తుల‌ను భారీగా మెరుగుపరుచుకోవాల‌ని సూచించారు.

Read Also…  Covid Prevention: కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్.. కేటీఆర్ కార్యాచరణ ఇదే!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu