Maharashtra: కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే.. ప్రధాని మోడీకి ఎన్నికలే ముఖ్యం అయిపోయాయి.. శివసేన ధ్వజం!

కరోనా ఉధృతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోడీకి ప్రజల బాధలకంటే, ఎన్నికల ప్రచారమే ప్రధానంగా మారిపోయిందని మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు.

Maharashtra: కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే.. ప్రధాని మోడీకి ఎన్నికలే ముఖ్యం అయిపోయాయి.. శివసేన ధ్వజం!
bjp-and-sivasena
Follow us
KVD Varma

|

Updated on: Apr 17, 2021 | 6:07 PM

Maharashtra: కరోనా ఉధృతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోడీకి ప్రజల బాధలకంటే, ఎన్నికల ప్రచారమే ప్రధానంగా మారిపోయిందని మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. కోవిడ్ -19 చికిత్సకు మందు అయిన ఆక్సిజన్, రెమెడెసివిర్ కొరతపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ, ప్రధాని పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సమాచారం అందించారని ఆయన చెప్పారు. ఒక పక్క ప్రజలు ఛస్తుంటే ప్రధాని మోడీకి ఎన్నికల ప్రచారం ప్రధానమైపోయింది అని ఆయన విరుచుకు పడ్డారు. ఒక పక్క కరోనా వ్యాప్తి పెరిగిపోతున్న దశలో.. వెస్ట్ బెంగాల్ లో రాజకీయ నేతలు అంతా ఏమాత్రం కోవిడ్ జాగ్రత్తలు లేని ఎన్నికల ర్యాలీలలో ఒకరిపై ఒకరు కరోనా వ్యాప్తికి మీరు కారణమంటే మీరు అని కొట్టుకుంటున్న సమయంలో నవాబ్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

అయితే, పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల మధ్య శుక్రవారం ఆక్సిజన్ సరఫరా స్థితిని ప్రధాని మోడీ స్వయంగా సమీక్షించారని, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని మాలిక్ ఆరోపణను ప్రధాని కార్యాలయం (పిఎంఓ) ఖండించింది. మరోపక్క ఉద్ధవ్ ఠాక్రే పిలుపునకు ప్రధాని అందుబాటులో లేరని ఆరోపణలు వచ్చిన వెంటనే, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ మోడీ పై ట్విట్టర్‌లో ట్వీట్ల యుద్ధం ప్రారంభించారు. ఇక కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ మహారాష్ట్రకు దేశంలో అన్ని ప్రాంతాలకంటే ఎక్కువ ఆక్సిజన్ లభించింది. ఇవి సిగ్గుమాలిన రాజకీయాలు అంటూ కౌంటర్ ఇచ్చారు.

ఇదిలా ఉంటె.. కరోనావైరస్ వ్యాధితో ఎక్కువగా నష్టపోయిన నగరాల్లో ముంబైని పూర్తిగా లాక్డౌన్ పరిధిలోకి తీసుకురావాలని మేయర్ కిషోరి పెడ్నేకర్ అన్నారు. అంతేకాకుండా, కుంభ్ నుండి తిరిగి వచ్చే వారు కోవిడ్ -19 ను ‘ప్రసాద్’ లాగా వ్యాపింప చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. కోవిడ్ -19 కేసులు పెరగడానికి పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఎన్నికల ర్యాలీలు ప్రధాన కారణం అని శివసేన ఆరోపించింది. ఈ కోవిడ్ -19 కేసుల పెరుగుదలకు కేంద్రం, ఈసీ  కారణం అంటూ శివసేన వ్యాఖ్యానించింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, 10 రాష్ట్రాలు – మహారాష్ట్ర, చత్తీస్ గడ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ , మధ్యప్రదేశ్, గుజరాత్ అలాగే రాజస్థాన్ రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్క థానే జిల్లాలో 5,039 కొత్త కోవిడ్ -19 కేసులు, 39 మంది మరణించారు