మహారాష్ట్ర కరోనా విలయతాండవం.. కేవలం 24 గంటల్లో 50 మందిని బలి తీసుకున్న కరోనా

మహారాష్ట్రలో కరోనా మహా విజృంభణ కొనసాగుతుంది. గత కొద్దిరోజులుగా తగ్గినట్లే తగ్గి మళ్లీ కొత్త కేసులు పుంజుకుంటున్నాయి. ఇప్పటి వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 17.80 లక్షల మార్కును దాటింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు...

మహారాష్ట్ర కరోనా విలయతాండవం.. కేవలం 24 గంటల్లో 50 మందిని బలి తీసుకున్న కరోనా
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 22, 2020 | 8:25 PM

Maharashtra Reports : మహారాష్ట్రలో కరోనా మహా విజృంభణ కొనసాగుతుంది. గత కొద్దిరోజులుగా తగ్గినట్లే తగ్గి మళ్లీ కొత్త కేసులు పుంజుకుంటున్నాయి. ఇప్పటి వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 17.80 లక్షల మార్కును దాటింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, రెండంకెల సంఖ్యల్లో మరణాలు నమోదవుతున్నాయి.

శనివారం నుంచి ఆదివారం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 5,753 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా, వైరస్ ధాటికి తాళలేక ఒక్కరోజే 50 మంది ప్రాణాలొదిలారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,80,208కు చేరకుందని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఇక ఇప్పటివరకు కొవిడ్ బారినపడి మరణించిన వారి సంఖ్య 46,623కు చేరుకుంది. మరోవైపు, గత 24 గంటల్లో 4,060 మంది కరోనా రోగులు కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 16,51,064కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 81,512 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది.