క్షణం తీరికలేని కేటీఆర్. ప్రభుత్వ సదస్సులు, ఎన్నికల ప్రచారంతో ఫుల్ బిజీ, బీజేపీపై 132కోట్ల ఛార్జ్‌షీట్లు వేయాలంటూ ధ్వజం
ఒక వైపు ప్రభుత్వ కార్యకలాపాలు, సదస్సులతో బిజిబిజీగా గడుపుతూనే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలోనూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ పలు చోట్ల కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. పనిలోపనిగా కేసీఆర్ సర్కారు ఈ ఆరేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులను గురించి వివరించే ప్రయత్నం చేశారు. నగరానికి 2050 […]
ఒక వైపు ప్రభుత్వ కార్యకలాపాలు, సదస్సులతో బిజిబిజీగా గడుపుతూనే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలోనూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ పలు చోట్ల కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. పనిలోపనిగా కేసీఆర్ సర్కారు ఈ ఆరేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులను గురించి వివరించే ప్రయత్నం చేశారు.
నగరానికి 2050 వరకు ఎలాంటి నీటి ఇక్కట్లు రాకుండా ప్రణాళికలు రూపొందించినట్లు కేటీఆర్ తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని జహీరానగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పలు అంశాలపై ప్రసంగించారు. హైదరాబాద్‌ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ ఉంటే వార్త.. ఇప్పడు కరెంట్ పోతే వార్త అని వెల్లడించారు. హైదరాబాద్‌లో పోకిరీల పోకడలు, ఆకతాయిల ఆగడాలు లేకుండా చేశామని వివరించారు.
ఆరేళ్లలో తెరాస 60 వైఫల్యాలంటూ బీజేపీ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఛార్జ్‌షీట్ వేయాల్సి వస్తే బీజేపీపై 132 కోట్ల ఛార్జ్‌షీట్లు వేయాలని కేటీఆర్ ధ్వజమెత్తారు.