AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Microwave: మైక్రోవేవ్‌లో ఆహారం వేడి చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..

ఈ రోజుల్లో ఆహారాన్ని వేడి చేయడానికి మైక్రోవేవ్ ఎక్కువగా వాడుతున్నారు. దీనితో ఆహారాన్ని వేడి చేయడం చాలా సులభం, కానీ దానిలో చాలా ప్రతికూలతలు కూడా ఉన్నాయి.

Microwave: మైక్రోవేవ్‌లో ఆహారం వేడి చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..
Food
Srinivas Chekkilla
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 04, 2022 | 7:40 AM

Share

ఈ రోజుల్లో ఆహారాన్ని వేడి చేయడానికి మైక్రోవేవ్ ఎక్కువగా వాడుతున్నారు. దీనితో ఆహారాన్ని వేడి చేయడం చాలా సులభం, కానీ దానిలో చాలా ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మైక్రోవేవ్‌లో వేడి చేసిన ఆహార పదార్థలు తినడం వల్ల శరీరానికి చాలా హాని కలుగుతుంది.

పిల్లల పాలు: తరచుగా ఇళ్లలో పిల్లలకు ఇచ్చే పాలను మైక్రోవేవ్‌లోనే వేడి చేయడం గమనిస్తుంటారు. ప్లాస్టిక్ సీసాలో పాలు వేడి చేయడం వల్ల క్యాన్సర్ కారకాలు వచ్చే ప్రమాదం ఉంది.

రైస్: ప్రజలు రైస్ వేడి చేయడానికి మైక్రోవేవ్‌ని ఉపయోగిస్తారు. కానీ అది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది.

చికెన్: చికెన్ మైక్రోవేవ్‌లో చాలా వేడిగా ఉంటుంది, కానీ దానిని తినడం వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థకు హాని కలుగుతుంది. దీని వల్ల చికెన్ లో ఉండే ప్రొటీన్ నిర్మాణంలో మార్పు వస్తుందని అంటున్నారు.

నూనె: ఇది శీతాకాలం ప్రజలు గడ్డకట్టిన కొబ్బరి నూనెను వేడి చేయడానికి మైక్రోవేవ్‌ను ఉపయోగిస్తారు. అయితే మైక్రోవేవ్‌లో నూనెను వేడి చేయడం వల్ల అందులో ఉండే మంచి కొవ్వును బ్యాడ్‌ ఫ్యాట్‌గా మారుస్తుంది. అందుకే కొబ్బరి నూనెనే కాదు, మైక్రోవేవ్‌లో ఎలాంటి నూనెను వేడి చేయవద్దు.

పుట్టగొడుగు: మైక్రోవేవ్‌లో వేడి చేయడం వల్ల అందులో ఉండే ప్రొటీన్లు నాశనం అవుతాయి. మీరు పుట్టగొడుగులను తయారు చేసినప్పుడల్లా, అదే సమయంలో తినడం మంచిది.

Read Also..  Contraceptive Pills: గర్భ నిరోధక మాత్రలు వాడితే స్త్రీలలో ఊబకాయం వస్తుందా? ఇది నిజమేనా? తెలుసుకోండి!