AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీరియడ్స్ టైమ్‌లో ఈ ఫుడ్స్ తింటే స్టమక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి..! అవేంటో తెలుసా..?

పీరియడ్స్ టైమ్‌లో డైజెస్టివ్ ఇష్యూస్ రావడం చాలా కామన్. హార్మోన్ల మార్పుల వల్ల మలబద్ధకం, డయేరియా, బ్లోటింగ్, స్టమక్ పెయిన్ లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవి పెద్దగా ప్రమాదం కాకపోయినా చాలా ఇబ్బంది పెడతాయి. సరైన ఫుడ్, వాటర్, లైఫ్‌స్టైల్ మార్పులతో ఈ సమస్యలను కంట్రోల్ చేసి పీరియడ్స్‌ను ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు.

పీరియడ్స్ టైమ్‌లో ఈ ఫుడ్స్ తింటే స్టమక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి..! అవేంటో తెలుసా..?
Menstrual Health
Prashanthi V
|

Updated on: Aug 16, 2025 | 9:14 PM

Share

పీరియడ్స్ సమయంలో జీర్ణక్రియలో తేడాలు రావడం చాలా కామన్. ముఖ్యంగా ప్రొజెస్టెరాన్, ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్ల లెవెల్స్‌లో మార్పుల వల్ల ఈ సమస్యలు వస్తాయి. దీని వల్ల మలబద్ధకం, డయేరియా, బ్లోటింగ్ లేదా పొత్తికడుపు నొప్పి లాంటి ఇష్యూస్ ఎదురవుతాయి.

హార్మోన్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..?

ప్రోస్టాగ్లాండిన్స్ ప్రేగుల కండరాలు క్రాంప్స్ అయ్యేలా చేస్తాయి. దీని వల్ల మలం మూవ్‌మెంట్ ఫాస్ట్ గా జరిగి డయేరియా రావచ్చు. మరోవైపు ప్రొజెస్టెరాన్ జీర్ణక్రియను స్లో చేసి మలబద్ధకాన్ని పెంచుతుంది. ఇవి పెద్దగా ప్రమాదం కాకపోయినా చాలా ఇబ్బంది పెడతాయి. కానీ డైట్‌లో, లైఫ్‌స్టైల్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ సమస్యలను కంట్రోల్ చేయవచ్చు.

పీరియడ్స్ టైమ్‌లో పాటించాల్సినవి..

  • ఎక్కువ నీళ్లు తాగండి.. రోజూ ఎక్కువ నీళ్లు తాగడం చాలా అవసరం. ఇది మలబద్ధకం తగ్గించడమే కాకుండా.. శరీరంలో ఎక్కువైన సోడియంను బయటకు పంపి బ్లోటింగ్‌ను తగ్గిస్తుంది.
  • ఫైబర్ ఫుడ్స్.. ఓట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తృణధాన్యాలు ఫైబర్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇవి డయేరియా, మలబద్ధకం రెండింటినీ కంట్రోల్ చేస్తాయి.
  • కెఫిన్, షుగర్ డ్రింక్స్ తగ్గించండి.. కాఫీ, టీ లాంటి కెఫిన్ డ్రింక్స్ ప్రేగుల మూవ్‌మెంట్‌ను పెంచి డయేరియాను ఇంకా ఎక్కువ చేస్తాయి. షుగర్ డ్రింక్స్ అయితే బ్లోటింగ్, గ్యాస్‌కు కారణమవుతాయి.
  • పాలు, డైరీ ప్రొడక్ట్స్ జాగ్రత్త.. కొంతమందికి పీరియడ్స్ టైమ్‌లో లాక్టోస్ సరిగా డైజెస్ట్ అవ్వదు. దాని వల్ల గ్యాస్, బ్లోటింగ్ వస్తాయి. అలాంటి వాళ్లు ఈ రోజుల్లో మిల్క్ ప్రొడక్ట్స్‌కు కొద్దిగా బ్రేక్ ఇవ్వడం మంచిది.
  • ప్రోబయోటిక్స్.. పెరుగు, పులియబెట్టిన ఆహారాలు ప్రేగులలోని మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. స్టమక్ పెయిన్‌ను కూడా తగ్గిస్తాయి.
  • లైట్ ఎక్సర్‌సైజ్.. తేలికపాటి వాకింగ్, యోగా లాంటివి బ్లోటింగ్, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. అలాగే పీరియడ్స్ క్రాంప్స్‌ను కూడా తగ్గిస్తాయి.
  • స్మాల్ మీల్స్.. ఒక్కసారిగా ఎక్కువ తినడం కంటే రోజులో కొన్నిసార్లు కొద్దిగా తినడం డైజెస్టివ్ సిస్టమ్‌పై ఒత్తిడి తగ్గిస్తుంది.
  • ఆయిల్, స్పైసీ ఫుడ్స్ వద్దు.. ఎక్కువ ఆయిల్ లేదా కారం ఉన్న ఫుడ్స్ కడుపుకు భారం. వీటి వల్ల డయేరియా లేదా స్టమక్ పెయిన్ పెరుగుతాయి.
  • హాట్ వాటర్ బ్యాగ్.. వేడి నీటి బ్యాగ్‌ను పొట్టపై పెట్టుకుంటే కండరాలు రిలాక్స్ అవుతాయి. నొప్పి తగ్గి జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.
  • లక్షణాలు గమనించండి.. ఏ ఫుడ్ లేదా హ్యాబిట్ మీకు ఇబ్బంది కలిగిస్తుందో ఒక నోట్ చేసుకోండి. ఇది మీ బాడీకి ఏది సూట్ అవుతుందో తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది.
  • పీరియడ్స్ టైమ్‌లో వచ్చే డైజెస్టివ్ సమస్యలు కామన్ అయినప్పటికీ.. లైఫ్‌స్టైల్‌లో చిన్న మార్పులు చేసుకుంటే వాటిని ఈజీగా కంట్రోల్ చేయవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)