Men Health: అబ్బాయిలూ జర భద్రం.. 30 ఏళ్ల వయసులోపు ఈ లైంగిక సమస్యలు రావొచ్చు..!
పురుషులకు అత్యంత కీలకమైన దశ 20 నుంచి 30 సంవత్సరాల వయసు. ఈ వయసులో పురుషుల్లో అధిక లిబిడో, వేగవంతమైన జీవక్రియ ఉంటుంది.
పురుషులకు అత్యంత కీలకమైన దశ 20 నుంచి 30 సంవత్సరాల వయసు. ఈ వయసులో పురుషుల్లో అధిక లిబిడో, వేగవంతమైన జీవక్రియ ఉంటుంది. అయితే, వయసు పెరిగే కొద్ది పురుషులు లైంగిక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలు 20 నుంచి 30 ఏళ్లు వస్తున్నా కొద్ది మొదలవుతాయి. సరికాని జీవనశైలి, మానసిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, వీటితో పాటు.. జీవన సంబంధమైన అనేక సమస్యలు కూడా లైంగిక సంబంధమైన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చెబుతున్నారు.
పురుషులు ఎదుర్కొనే సాధారణ లైంగిక సమస్యలు..
1. అంగస్తంభన: సంభోగం సమయంలో అంగస్తంభనను నిర్వహించడం కష్టతరం అవుతుంది.
2. శీఘ్ర స్కలనం: సంభోగం సమయంలో భాగస్వామి కంటే ముందుగానే స్కలనం చేస్తారు. త్వరగా స్కలనం అవడం జరుగుతుంది.
3. టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం: టెస్టోస్టెరాన్ ఉత్తత్తి తగ్గుతుంది. ఫలితంగా లైంగిక కోరికలు తగ్గడం, లైంగిక శక్తి తగ్గడం జరుగుతుంది.
4. తక్కువ స్పెర్మ్ కౌంట్: ఒలిగోజోస్పెర్మియా అని కూడా పిలుస్తారు. పురుషుల్లో ఒక మిల్లీలీటర్ వీర్యంలో 15 మిలియన్ల కంటే తక్కువ శుక్రకణాలు ఉంటాయి.
5. ఇతర వ్యాధులు: పురుషుల్లో సిఫిలిస్, హెపటైటిస్ వంటి ఇతర లైంగిక సంక్రమణ వ్యాధులు కూడా ఎక్కువగా వస్తాయి.
ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పురుషులు తమ జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి? నిపుణులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఏం తినాలి? ఏం తినకూడదు? వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1. మద్యం మానుకోవాలి: రోజూ ఒకటి లేదా రెండు గ్లాసుల రెడ్ వైన్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, అధిక మద్యపానం చేసేవారు మాత్రం ఇకనుంచైనా మద్యానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇది పురుషుల్లో లిబిడోను తగ్గించడంతో పాటు.. కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా ఆరోగ్యం క్షీణిస్తుంది.
2. టెస్టోస్టెరాన్ స్థాయిలు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి: తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు లిబిడో తగ్గడం, జుట్టు రాలడం, నిరాశ, జ్ఞాపకశక్తి లోపం వంటి అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందుకే.. టెస్టోస్టెరాన్ స్థాయిలు సక్రమంగా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. చేపలు, మాంసం, జున్ను, పెరుగు వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. సమస్య తీవ్రమైతే.. వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
3. వైద్యుల సహాయం: లైంగిక ఆరోగ్యం క్షీణించినట్లుగా మీరు భావించినా, ఇతర లైంగిక సమస్యలు ఉన్నా వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. సమస్య మొదట్లో ఉన్నప్పుడే చికిత్స తీసుకోవాలి. లైంగిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి.
4. కంటినిండా నిద్ర: ప్రతి రోజూ కనీసం 7 గంటలు అయినా నిద్రపోవాలి. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మొదడు ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, లైంగిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మంచి నిద్ర టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. లిబిడో ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు.. కంటినిండా నిద్ర.. స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..