LIC Loan: ఎల్ఐసీ పాలసీపై లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Nov 09, 2022 | 7:13 AM

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రతి వర్గానికి పాలసీలను అందిస్తుంది. ఇందులో రక్షణతో పాటు నిధులను డిపాజిట్ చేసే ఎంపిక కూడా ఇవ్వడం జరిగింది.

LIC Loan: ఎల్ఐసీ పాలసీపై లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..
Lic

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రతి వర్గానికి పాలసీలను అందిస్తుంది. ఇందులో రక్షణతో పాటు నిధులను డిపాజిట్ చేసే ఎంపిక కూడా ఇవ్వడం జరిగింది. LIC పాలసీపై పన్ను ప్రయోజనాలు, రుణ ప్రయోజనాలు కూడా ఇవ్వబడతాయి. మీరు కూడా ఎల్‌ఐసీ పాలసీని తీసుకుని, దానిపై రుణం తీసుకోవాలనుకుంటే.. పర్సనల్ లోన్ కంటే ఇది ఉత్తతమైన ఎంపిక అని చెప్పవచ్చు. మీ ఆర్థిక అవసరాలను తీర్చగల సురక్షితమైన ఎంపి ఎల్‌ఐసిపై లోన్. ఎల్‌ఐసి పాలసీ కింద లోన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు? ఏ పాలసీ హోల్డర్‌లు లోన్ పొందడానికి అర్హులు? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎల్‌ఐసీపై రుణం తీసుకోవడానికి ఎవరు అర్హులు?

1. రుణం తీసుకోవాలనుకుంటే మీ వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.

2. చెల్లుబాటు అయ్యే LIC పాలసీని కలిగి ఉండాలి.

ఇవి కూడా చదవండి

3. రుణం కోసం ఉపయోగించే ఎల్‌ఐసి పాలసీకి గ్యారెంటీ సరెండర్ విలువ ఉండాలి.

4. కనీసం 3 సంవత్సరాల పాటు పూర్తి LIC ప్రీమియం చెల్లించిన తర్వాత మాత్రమే పాలసీపై లోన్ తీసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో రుణం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

1. ముందుగా ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. ఇక్కడ ‘ఆన్‌లైన్ లోన్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

3. ఆన్‌లైన్ LIC లోన్ కోసం ‘త్రూ కస్టమర్ పోర్టల్’పై క్లిక్ చేయాలి.

4. లాగిన్ చేయడానికి, వినియోగదారు ID, DOB, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయాలి.

5. రుణం తీసుకోవాలనుకుంటున్న పాలసీని ఎంచుకోవాలి.

6. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తరువాత 3 నుంచి 5 రోజుల్లో రుణం మంజూరు అవుతుంది.

ఆఫ్‌లైన్ లోన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

1. మొదట సమీపంలోని ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లండి.

2. అక్కడ లోన్ కోసం దరఖాస్తు ఫారమ్ నింపాలి.

3. ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్‌తో పాటు KYC పత్రాన్ని సమర్పించండి.

4. వివరాలన్నింటినీ అక్కడి అధికారులు ధృవీకరిస్తారు.

5. పాలసీ సరెండర్ ధరలో 90% వరకు రుణం ఇవ్వబడుతుంది.

LIC పాలసీపై లోన్ పొందడానికి ఏ డాక్యుమెంట్లు అవసరం?

1. ఎల్ఐసీ ప్లాన్ కింద లోన్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నట్లయితే.. తప్పనిసరిగా కొన్ని డాక్యూమెంట్లను కలిగి ఉండాలి. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లు, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి, ఇతర గుర్తింపు పత్రాలు అవసరం అవుతాయి.

2. నివాస రుజువు కోసం ఆధార్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం.

3. ఆదాయ రుజువు కోసం పేమెంట్స్ స్లిప్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu