Men Health: మగాళ్లకు వరం ఈ సూపర్ ఫుడ్.. తింటే స్పెర్మ్ కౌంట్‌ను భారీగా పెరుగుతుంది.. పూర్తి వివరాలివే..
వంధ్యత్వం అనేది మహిళలకు మాత్రమే కాదు, పురుషులను కూడా ప్రభావితం చేస్తుంది. పెరుగుతున్న ఒత్తిడి, మాదకద్రవ్యాల వినియోగం, సరైన ఆహారం తీసుకోవడం
వంధ్యత్వం అనేది మహిళలకు మాత్రమే కాదు, పురుషులను కూడా ప్రభావితం చేస్తుంది. పెరుగుతున్న ఒత్తిడి, మాదకద్రవ్యాల వినియోగం, సరైన ఆహారం తీసుకోవడం, అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా పురుషులలో స్పెర్మ్ కౌంట్ భారీగా పడిపోతుంది. ఇది వారిలో వంధ్యత్వ సమస్యను పెంచుతోంది. దంపతులు లైంగిక సంపర్కం ద్వారా మాత్రమే పిల్లలను పొందుతారు. మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు బిడ్డను కనడంలో సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే శుక్రకణం, స్త్రీ అండంతో కలిసి బిడ్డ జననానికి కారణం అవుతుంది. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే.. పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. పురుషులలో తక్కువ స్పెర్మ్ కౌంట్‌ను ఒలిగోస్పెర్మియా అని అంటారు. అయితే, ఈ సమస్యకు మంచి ఆహారం, డ్రింక్స్‌తో చెక్ పెట్టవచ్చని అంటున్నారు నిపుణులు.
కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా స్పెర్మ్ కౌంట్ సులభంగా పెరుగుతుంది. స్పెర్మ్ కౌంట్‌ను పెంచడంలో ప్రభావవంతంగా పనిచేసే సూపర్‌ఫుడ్‌లో గుల్కంద్ కూడా ఒకటి. మనలో చాలామంది భోజనం తర్వాత తమలపాకు, గుల్కంద్, సోపు, ఏలకులతో కూడిన పాన్ తినడానికి ఇష్టపడతారు. గుల్కంద్ అనేది గులాబీ రేకులు, పంచదారతో చేసిన స్టిక్కీ జామ్, మార్మాలాడ్. దీనిని పాన్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ గుల్కంద్‌తో అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గుల్కంద్ తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ భారీగా పెరుగుతుంది. అనేక అధ్యయనాల్లో ఈ విషయం రుజువైంది.
గుల్కంద్ తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ ఎలా పెరుగుతుంది?
అర్బన్ ప్లాంటర్‌లోని పోషకాహార నిపుణురాలు రీమా కింజల్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. గుల్కంద్ వినియోగం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండే గుల్కంద్‌ను స్పెర్మ్ కౌంట్ పెంచే విషయంలో సూపర్ ఫుడ్‌గా పేర్కొన్నారు. దీనిని గులాబీ పువ్వుల నుండి తయారు చేస్తారు. ఈ పువ్వు ప్రత్యేక గుణం పురుషులలో స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతుంది. సంతానలేమి వ్యాధి ఉన్న స్త్రీలు కూడా దీనిని తీసుకుంటే మేలు జరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుల్కంద్ తీసుకోవడం వల్ల పునరుత్పత్తి అవయవాల కండరాలు విశ్రాంతి పొందుతాయి. పురుషులలో స్పెర్మ్ కౌంట్, దాని చలనశీలత పెరుగుతుందని అనేక పరిశోధనలలో వెల్లడైంది.
గుల్కంద్ ఆరోగ్య ప్రయోజనాలు..
1. ఇది సహజ శీతలకరణి. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంది. ఇది ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
2. పాన్ ఆహారాన్ని జీర్ణం చేసే లక్షణాలను కలిగి ఉంది. అందుకే ప్రజలు భోజనం తర్వాత తినడానికి ఇష్టపడతారు. గుల్కంద్‌ను పాన్‌తో కలిపితే, జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.
3. ఐరన్ అధికంగా ఉండే గుల్కంద్ పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది.
4. గుల్కంద్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుందని. శరీరంలోని అన్ని కణాలకు ఎక్కువ ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. శక్తిని ఇస్తుంది.
5. పీరియడ్స్‌కు సంబంధించిన అన్ని సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
6. ఈ సూపర్ ఫుడ్ చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఇది చర్మాన్ని క్లియర్‌గా మార్చడానికి రక్త శుద్ధి, డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇది కురుపులు, పొక్కులు, మొటిమలు వంటి చర్మ సమస్యలను నివారిస్తుంది.
7. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో సమృద్ధిగా ఉన్న గుల్కంద్ ఒత్తిడి, కాలుష్యం వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..