Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Tips: రూమ్‌ హీటర్ల వాడకంలో ఈ తప్పులు చేస్తున్నారా.? గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త..

చలి పులి తన పంజాను క్రమంగా విసురుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. దీంతో జనాలు చలిని తట్టుకునేందుకు గాను జర్కిన్లు, గ్లౌవ్స్‌, క్యాప్‌లను వాడుతున్నారు. ఇక మరీ చల్లటి వాతావరణంలో ఉండే వారు హీటర్లను ఉపయోగిస్తుంటారు. గదిలో కృత్రిమంగా వేడి వాతావరణాన్ని సృష్టించడం ఈ హీటర్ల పని. అయితే..

Winter Tips: రూమ్‌ హీటర్ల వాడకంలో ఈ తప్పులు చేస్తున్నారా.? గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త..
Room Heaters
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 10, 2022 | 5:29 PM

చలి పులి తన పంజాను క్రమంగా విసురుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. చలి కాలం రావడంతో జనాలు చలిని తట్టుకునేందుకు గాను జర్కిన్లు, గ్లౌవ్స్‌, క్యాప్‌లను వాడుతున్నారు. ఇక మరీ చల్లటి వాతావరణంలో ఉండే వారు హీటర్లను ఉపయోగిస్తుంటారు. గదిలో కృత్రిమంగా వేడి వాతావరణాన్ని సృష్టించడం ఈ హీటర్ల పని. అయితే ఈ హీటర్లను, బ్లోయర్‌ల వల్ల ఇన్‌స్టాంట్‌గా లాభం కలిగినట్టే అనిపించినా, వాటి వల్ల దీర్ఘ కాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం తప్పదని నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి హీటర్లు ఉన్న గదుల్లో గడిపితే పలు అనారోగ్య సమస్యలు తప్పవని సూచిస్తున్నారు.

హీటర్ లేదా బ్లోవర్ ఉన్న గది డోర్‌ను గంటల తరబడి మూసి ఉంచడం ఆరోగ్యానికి ప్రమాదకరమని చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్‌కు చెందిన ప్రొఫెసర్ క్యాత్ నోక్స్ మాట్లాడుతూ ఈ విషయమై మాట్లాడుతూ.. ‘రూమ్ హీటర్‌లు ప్రజలకు సౌకర్యంగా ఉన్నప్పటికీ, ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కిటికీలు మూసివేయడం వల్ల గదిలో ఉండే ఆ వేడీ శరీరంపై చెడు ప్రభావం చూపిస్తుంది. గదిలో ఆక్సిజన్‌ శాతం తగ్గడం వల్ల ఊపిరాడకపోవడం, వికారం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. దీర్ఘకాలంలో ఇది గుండె పోటుకు కూడా కారణంగా మారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే గదిలో హీటర్‌ను ఉపయోగిస్తే కచ్చితంగా విండోస్‌ తెరిచి ఉండాలని సూచిస్తున్నారు. దీని ద్వారా సరైన వెంటిటేషన్‌ ఉంటుందని గది ఉష్ణోగ్రత బ్యాలెన్స్‌ అవుతుందని చెబుతున్నారు. హీటర్లు ఉన్న గదిలో గంటల తరబడి ఉంటే చికెన్ పాక్స్, టీబీ వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇక సాధారణ సమయాల్లోనూ ఇంట్లో సరైన వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. గదిలో ఉండే గాలి బయటకు వెళ్లేలా, బయట గాలి లోపలికి వచ్చేలా ఏర్పా్ట్లు చేసుకోవాలని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..