AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Almonds: చలికాలంలో బాదం పప్పు తింటున్నారా.. ఇలా చేస్తే అద్భుత ప్రయోజనాలు మీ సొంతం..

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలిగిస్తాయనే విషయం మనందిరికే తెలిసిందే. వీటిలోనూ ముఖ్యంగా బాదంపప్పుల వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ కంటెంట్...

Almonds: చలికాలంలో బాదం పప్పు తింటున్నారా.. ఇలా చేస్తే అద్భుత ప్రయోజనాలు మీ సొంతం..
Almonds
Ganesh Mudavath
|

Updated on: Nov 10, 2022 | 6:27 PM

Share

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలిగిస్తాయనే విషయం మనందిరికే తెలిసిందే. వీటిలోనూ ముఖ్యంగా బాదంపప్పుల వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే బాదంను సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు మెదడు చురుకుగా ఉండేలా చేస్తుంది. పోషకాహార లోపాన్ని నివారించుకోవడానికి ప్రతి ఒక్కరూ రోజూ బాదంపప్పును ఆహారంలో భాగం చేసుకోవడం చాలా అవసరం. అయితే బాదంపప్పు తినే సమయంలో వాతావరణం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో కంటే చలికాలంలోనే బాదంపప్పును ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకుంటే చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అంతే కాకుండా శరీర ఉష్ణోగ్రత కూడా పడిపోతుంటుంది. ఈ సమయంలో బాదం పప్పు తినడం ద్వారా శరీరం వెచ్చగా ఉంచేలా చేస్తుంది. చలికాలంలో బాదంపప్పును వేయించి తినవచ్చు. ఇలా చేయడం వల్ల అందులోని పోషకాలు శరీరానికి సమంగా అందుతాయి. కొన్ని బాదం పప్పులను తీసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. కాస్త నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యంగానూ రుచికరంగానూ ఉంటుంది.

బాదంపప్పును వేయించి తినడం ఇష్టం లేని వాళ్లు పొడిగా చేసుకుని పాలల్లో కలుపుకుని తాగవచ్చు. బాదంలో ఉండే పోషకాలు, పాలలో ఉండే కాల్షియం ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బాదం పొడిని తీసుకుని రోస్ట్ చేస్తే చాలు. ఆ పౌడర్ ను చక్కగా పాలల్లో కలుపుకోవచ్చు. వారానికి కనీసం మూడు సార్లు తాగడం అలవాటు చేసుకుంటే మంచి లాభం ఉంటుంది. బాదంపప్పును వేయించి పాయసంలో కలుపుకుని తినవచ్చు. సెమోలినా (రవ్వ) , బాదం పప్పులను కలిపి తింటే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు. చలికాలంలో తయారుచేసే ఈ రకమైన ఆహార పదార్థాలు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వీరి జీవితాన్ని మార్చడానికి కలిసి రాబోతున్న భారీ గ్రహాలు
వీరి జీవితాన్ని మార్చడానికి కలిసి రాబోతున్న భారీ గ్రహాలు
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులకు కూడా యూపీఐ ఛార్జీలు పడతాయా?
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులకు కూడా యూపీఐ ఛార్జీలు పడతాయా?
రూ.1.7 లక్షల పెట్టుబడితో నాటుకోళ్ల పెంపకం.. రూ. 10 లక్షల లాభం..!
రూ.1.7 లక్షల పెట్టుబడితో నాటుకోళ్ల పెంపకం.. రూ. 10 లక్షల లాభం..!
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!
నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!