Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Late Night Eating: లేట్ నైట్ డిన్నర్ చేస్తున్నారా.. ఇలాంటి తీవ్రమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది.. మీరు కూడా ఇలా చేస్తున్నారా..

కొంతమందికి రాత్రిపూట భోజనం చేసే అలవాటు ఉంటుంది. రాత్రిపూట ఆహారం తీసుకోవడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

Late Night Eating: లేట్ నైట్ డిన్నర్ చేస్తున్నారా.. ఇలాంటి తీవ్రమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది.. మీరు కూడా ఇలా చేస్తున్నారా..
Late Night Eating
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 30, 2022 | 6:05 PM

కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో మన జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. కరోనా భయం ఉన్నప్పటికీ మంచి పౌష్టికాహారం, వ్యాయామం జీవితంలో భాగమయ్యాయి. కానీ పౌష్టికాహారం తినడం లేదా వ్యాయామం చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండలేము. దీనికి ఇంకా చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి సమయానికి భోజనం చేయడం. సమయానికి ఆహారం తీసుకోకపోవడం మన శరీరంపై ప్రభావం చూపుతుంది. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల మధుమేహం వస్తుంది. కొందరికి రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉంటుంది. కాబట్టి కొంతమందికి పని కారణంగా భోజనం చేసేందుకు సమయం దొరకదు.. దీంతో వారికి భోజనం చేసేయడంలో ఆలస్యం అవుతుంది. కాబట్టి లేట్ నైట్ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.

స్పెయిన్‌లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, సమయానికి రాత్రి భోజనం చేయడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. స్పెయిన్‌లోని 845 మంది పెద్దలపై ఈ అధ్యయనం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి వ్యక్తి ఎనిమిది గంటల పాటు నిరాహార దీక్ష చేశారు. మరుసటి రోజు రాత్రి సాధారణం కంటే ముందుగానే భోజనం చేశారు. మరుసటి రాత్రి సాధారణం కంటే ఆలస్యంగా తినిపించారు. ఈ సమయంలో పరిశోధకులు మెలటోనిన్ రిసెప్టర్-1బి జన్యువులోని జన్యు సంకేతాన్ని కూడా పరిశీలించారు. వారిలో వచ్చిన మార్పులను కూడా వారు పరిశీలించారు. 

ఇప్పుడు మెలటోనిన్ అంటే ఏంటి?

మెలటోనిన్ ఒక హార్మోన్. ఇది ప్రధానంగా రాత్రి సమయంలో చురుకుగా ఉంటుంది. ఈ హార్మోన్ నిద్రను  నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ పరిశోధనలో మెలటోనిన్-1బి జన్యువు ఎలివేట్ అయినట్లు తేలింది. కాబట్టి, ఆలస్యంగా తినేవారిలో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం కనిపించింది. రాత్రి భోజనం తర్వాత ఒకరి రక్తంలో మెలటోనిన్ స్థాయిలు 2.5 రెట్లు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. 

రాత్రి భోజనం ఆలస్యంగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు తగ్గి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అర్థరాత్రి భోజనం చేసే సమయాన్ని బట్టి, మెలటోనిన్-1బి, జి-అల్లెల్‌తో కలవడం వల్ల జన్యురూపం లేని వారి కంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు నిర్ధారించారు.

సమయం దాటిన తర్వాత భోజనం చేయడం వల్ల..

ముర్సియా విశ్వవిద్యాలయంలోని ఫిజియాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న ప్రధాన రచయిత్రి మార్టా గారోలెట్ ఇదే అంశంపై క్లుప్తంగా వివరించారు. ఆలస్యంగా తినడం పరిశోధనలో పాల్గొన్నవారిలో బ్లడ్ షుగర్‌ పెరిగినట్లుగా గుర్తించారు. ఇంకా, బలహీనమైన గ్లూకోజ్ స్థాయిలు ప్రధానంగా జన్యుపరమైన ప్రమాదంతో బాధపడుతున్న వ్యక్తులలో గమనించారు. రాత్రిపూట సమయం దాటిన తర్వాత భోజనం చేయడం వల్ల కూడా బరువు పెరుగుతారని గుర్తించారు. కాబట్టి మీరు కూడా రాత్రిపూట సమయానికి ఆహారం తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాలను నివారించడానికి భోజన సమయాన్ని నిర్ణయించడం మర్చిపోవద్దు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..