Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ప్రయాణంలో ఆ సమస్యతో ఇబ్బందులా.? ఈ చిట్కాలు ఫాలో అయితే సరి..

చాలా మందికి ప్రయాణం చేసే సమయంలో పొట్ట గడ బిడలాంటి సమస్యలు వేధిస్తుంటాయి. ప్రయాణం ఇలా మొదలైందో లేదో అజీర్ణం, డయేరియా వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, కలుషితమైన నీటిని తాగడం, నిద్రలేకపోవడం..

Health: ప్రయాణంలో ఆ సమస్యతో ఇబ్బందులా.? ఈ చిట్కాలు ఫాలో అయితే సరి..
Health Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 30, 2022 | 8:11 PM

చాలా మందికి ప్రయాణం చేసే సమయంలో పొట్ట గడ బిడలాంటి సమస్యలు వేధిస్తుంటాయి. ప్రయాణం ఇలా మొదలైందో లేదో అజీర్ణం, డయేరియా వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, కలుషితమైన నీటిని తాగడం, నిద్రలేకపోవడం వంటి కారణాలు ఈ సమస్యలకు కారణాలుగా చెప్పొచ్చు. అయితే ప్రయాణం చేసే ముందు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఇంతకీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రయాణం చేసే సమయంలో ఎదురయ్యే పొట్ట సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

* ప్రయాణం చేసే సమయాల్లో ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తుంది. ఈ కారణంగా దేనిని పడితే దానిని తాకాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. కరోనా తర్వాత సహజంగానే అందరికీ ఈ అలవాటు అబ్బింది. ప్రయాణం సమయంలో ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం.

* ఇక ప్రయాణాల్లో తీసుకునే నీటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ నీటిని తాగకుండా వీలైనంత వరకు ప్యాకేజ్‌డ్‌ డ్రింకింగ్ వాటర్‌ను తీసుకోవాలి. ఇంటి నుంచి తెచ్చుకునే నీటికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.

ఇవి కూడా చదవండి

* ఇక ప్రయాణం చేసే ముందు వీలైనంత వరకు ఆహారం తీసుకోకపోవడమే ఉత్తమం. వీలైనంత వరకు లిక్విడ్‌ ఫుడ్‌నే తీసుకునే ప్రయత్నం చేయాలి. ఓఆర్‌ఎస్‌ వంటి డ్రింక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి.

* ప్రయాణానికి ముందు రోజు రాత్రి కూడా ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. సాధారణంగా ప్రయాణానికి ముందు రోజు ఆతృతగా నిద్ర తగ్గుతుంది. ఇది కూడా అజీర్తి సమస్యకు దారి తీసే అవకాశం ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన వివరాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో ఎప్పుడైనా వైద్యుల సూచనలను పాటించడమే మేలు.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ