Beauty Tips: మీ వంటింట్లో లభించే వాటితో పాదాలపై ఉండే నల్లదనాన్ని తొలిగించవచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు..

అలోవెరా జెల్ చర్మాన్ని మెరుపును ఇస్తుంది. అలాగే చర్మంలోని నల్లటి వలయాలను తొలగిస్తుంది. అయితే ఇలాంటి నలుపును తొలిగించేందుకు మన వంటింట్లో ఉండేవాటిని ఉపయోగించి..

Beauty Tips: మీ వంటింట్లో లభించే వాటితో పాదాలపై ఉండే నల్లదనాన్ని తొలిగించవచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
Remove Black Feet
Follow us

|

Updated on: Oct 30, 2022 | 8:27 PM

మనం మన ముఖాన్ని జాగ్రత్తగా చూసుకున్నంతగా మన పాదాలను పట్టించుకోము. ఫలితంగా మన పాదాలపై నల్లటి మచ్చలు కనిపిస్తాయి. పాదాలపై ఈ నల్లటి మచ్చలు చూడటానికి చాలా చెత్తగా ఉంటాయి. చర్మం ఈ పేలవమైన ఛాయకు ప్రధాన కారణం మెలనిన్ అధికంగా ఉత్పత్తి కావడం. మెలనిన్ అనేది చర్మానికి పిగ్మెంటేషన్ ఇచ్చే సహజ వర్ణద్రవ్యం. చర్మంలో ఉండే మెలనోసైట్స్ కణాలలో దీని నిర్మాణం ప్రక్రియ పూర్తవుతుంది. మీ చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉంటే.. మీ చర్మం ముదురు రంగులో ఉంటుంది. కాళ్లపై నల్లటి మచ్చలు అంటే ఆ ప్రాంతంలో మెలనిన్ ఎక్కువగా ఉందని అర్థం. ఈ డార్క్ స్పాట్స్ మీ పాదాలు, శరీరంలో ఎక్కడైనా రావచ్చు. తరచుగా మనం పాదాల నలుపును పోగొట్టుకోవడానికి పెడిక్యూర్ సహాయం తీసుకుంటాం వల్ల మీ పాదాల నలుపు తగ్గదు. అంతకంటే మరో ప్రయత్నం చేయాలి.

మీరు కూడా పాదాల నలుపుతో ఇబ్బంది పడుతుంటే.. వాటిని తొలగించుకోవడానికి మీరు కొన్ని హోం రెమెడీస్ ప్లాన్ చేయవచ్చు. మన ఇంట్లో ఉండే అలోవెరా జెల్, బేకింగ్ సోడా, ఉప్పును ఉపయోగించడం వల్ల పాదాల నల్లదనాన్ని తొలగించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పాదాల నలుపును పోగొట్టడానికి ఈ వస్తువులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

చర్మానికి అలోవెరా జెల్, బేకింగ్ సోడా, ఉప్పుతో ప్రయోజనాలు:

అలోవెరా జెల్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని మెరుపును ఇస్తుంది, అలాగే చర్మంలోని నల్లటి వలయాలను తొలగిస్తుంది. దీన్ని చర్మంపై ఉపయోగించడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది. బేకింగ్ సోడాను చర్మానికి ఉపయోగించడం వల్ల చర్మం మెరుస్తుంది. ఇది డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. చర్మపు మచ్చలను తొలగిస్తుంది. నీటితో చర్మంపై ఉప్పును ఉపయోగించడం ద్వారా, చర్మంపైన ఉండే ఓపెన్ రంధ్రాలు మూసివేయబడతాయి. ఇది చర్మాన్ని మృదువుగా.. తాజాగా చేస్తుంది. ఈ నీరు చర్మాన్ని శుభ్రంగా, మెరిసేలా చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

వీటిని ఉపయోగించండి

1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ 1 స్పూన్ అలోవెరా జెల్ 1 స్పూన్ ఉప్పు తీసుకోండి.

బేకింగ్ పౌడర్, అలోవెరా జెల్, సాల్ట్ ప్యాక్ రెసిపీ

పాదాల నలుపు పోవాలంటే అలోవెరా జెల్ లో బేకింగ్ పౌడర్, ఉప్పు కలిపి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ని పాదాల నల్లని భాగానికి పట్టించి పాదాలకు మసాజ్ చేయాలి. ఈ ప్యాక్‌తో 4-5 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను కడగాలి. పాదాలను కడిగిన తర్వాత వాటిని ఆరబెట్టి కొబ్బరినూనెతో పాదాలకు మసాజ్ చేయాలి. నిత్యం పాదాలను శుభ్రం చేసుకుంటే పాదాల నలుపు పోతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో