Dandruff Cure: చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా? మెంతులతో ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు..
ఈ రోజుల్లో చుండ్రు సమస్య చాలా సాధారణ విషయంగా మారింది. అయితే, శీతాకాలంలో తలలో చుండ్రు సమస్య మరింత తీవ్రమవుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో డాండ్రఫ్ సమస్య ఉన్నవారు చాలా ఇబ్బందులు పడతారు
ఈ రోజుల్లో చుండ్రు సమస్య చాలా సాధారణ విషయంగా మారింది. అయితే, శీతాకాలంలో తలలో చుండ్రు సమస్య మరింత తీవ్రమవుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో డాండ్రఫ్ సమస్య ఉన్నవారు చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే చుండ్రు ఉన్నవారి దుస్తులపై, చర్మంపై రాలి పోయి కనిపిస్తుంటుంది. ఇంకా తలలో దురద, మంట లాంటి లక్షణాలతో ఇబ్బందిగా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో.. హోం రెమెడీస్‌తో చుండ్రు సమస్యకు పుల్ స్టాప్ పెట్టొచ్చని పేర్కొంటున్నారు సౌందర్య నిపుణులు. డాండ్రఫ్ సమస్య నివారణకు మెంతులు బాగా సహాయపడతాయి. మెంతుల సహాయంతో మీరు చుండ్రును ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జుట్టుకు మెంతులను పలు విధాలుగా ఉపయోగిస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడొచ్చు. దీనికోసం మెంతులను ఏ పదార్థాలతో కలిపి అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మెంతులు – అలోవెరా జెల్..
కావలసినవి – రెండు టేబుల్ స్పూన్ల మెంతి గింజలు, రెండు టేబుల్ స్పూన్ల తాజా అలోవెరా జెల్
తయారుచేసే విధానంః మెంతి గింజలను ఒక గిన్నె నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే గింజలను గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేయండి. ఇప్పుడు దానికి తాజా అలోవెరా జెల్ కలపండి. ఈ పేస్ట్‌ను మీ తలకు, జుట్టుకు బాగా పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత షాంపూ సహాయంతో మీ జుట్టును శుభ్రం చేసుకోండి.
మెంతులు – గుడ్డు..
కావలసినవి – రెండు టేబుల్ స్పూన్లు మెంతి గింజలు, ఒక గుడ్డు
తయారుచేసే విధానం: మెంతి గింజలను ఒక గిన్నె నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం పూట గింజలను మెత్తగా రుబ్బాలి. ఈ పేస్ట్‌లో గుడ్డు పచ్చసొన వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ తలకు, జుట్టుకు పట్టించాలి. దాదాపు 30 నుంచి 45 నిమిషాల పాటు అలాగే ఉంచండి. అప్పుడు మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టుకు పోషణతోపాటు.. చుండ్రు సమస్య పోతుంది.
మెంతులు – పెరుగు
కావలసినవి – రెండు టేబుల్ స్పూన్లు మెంతి గింజలు, కొంచెం పెరుగు
తయారుచేసే విధానం: మెంతి గింజలను ఒక గిన్నెలో వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం పూట గింజలను పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్‌లో కొంచె పెరుగు వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ తలకు, జుట్టుకు పట్టించాలి. దాదాపు 30 నుంచి 45 నిమిషాల పాటు ఉంచి శుభ్రం చేసుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..