ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు.. ఎన్ని గ్లాసుల నీరు తాగాలో తెలుసా..  ప్రయోజనాలు తెలుసుకోండి..

సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా తీసుకోవాలని చెబుతుంటారు డాక్టర్. శరీరంలో నీటి శాతం తగినంత ఉండాలని..

ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు.. ఎన్ని గ్లాసుల నీరు తాగాలో తెలుసా..  ప్రయోజనాలు తెలుసుకోండి..
Water
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 15, 2021 | 4:01 PM

సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా తీసుకోవాలని చెబుతుంటారు డాక్టర్. శరీరంలో నీటి శాతం తగినంత ఉండాలని.. నీళ్లు ఎక్కువగా తాగకుంటే డీహైడ్రేషన్‏తోపాటు.. పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తుంటారు. అయినా కొందరు నీళ్లు అస్సలు తాగారు. అన్నం తినే సమయంలో మినహా.. నీళ్లు అసలు తీసుకోరు. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యల భారీన పడి ఇబ్బంది పడుతుంటారు. మరికొందరు నీళ్లు లిమిట్ లేకుండా తాగేస్తుంటారు. శరీరంలో తగినంత నీరు లేకపోతే తొందరగా అలసటకు గురవుతుంటారు. అంతేకాకుండా చర్మం, కళ్లు పొడిబారడం.. చిరాకుగా ఉండడం.. డీహైడ్రేషన్‏కు గురికావడం జరుగుతుంది. అలా కాకుండా.. రోజులో ఎప్పుడు.. ఎంత నీరు తాగాలో తెలుసుకుందామా.

సాధారణంగా ఆరోగ్యంగా ఉండే ప్రతి వ్యక్తి రోజుకు 8 గ్లాసుల నీరు తాగాలని సూచిస్తున్నారు వైద్యులు. అంతేకాకుండా.. దాదాపు 4 లీటర్ల వరకు నీరు తాగాలంట. ఉదయాన్నే 1 లేదా 2 గ్లాసుల నీరు తాగాలి. ఆ తర్వాత మధ్యాహ్నం తినడానికి ముందు ఎక్కువగా… తిన్న తర్వాత తక్కువగా తాగాలి. ఇలా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. స్నానం చేయడానికి ఒక గ్లాసు నీరు తాగడం వలన శరీరంలోని రక్తపోటు నియంత్రణలో ఉంటుందట. అలాగే నిద్రించే ముందు ఒక గ్లాసు నీరు తాగడం వలన శరీరంలో నీటి శాతం సరిగ్గా ఉండి గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

ఇక శరీర బరువు బట్టి నీరు తీసుకోవాల్సి ఉంటుందట. ప్రతి వ్యక్తి 20 కిలోల బరువును బట్టి ఒక లీటరు నీటిని తాగలంట. అంటే.. 70 కిలోల బరువున్న వ్యక్తి 3.5 లీటర్ల నీరు తాగాలి. మహిళలు ప్రతి రోజూ 2.7 లీటర్ల నీరు తాగితే.. పురుషులు రోజూకీ 3.7 లీటర్లు తాగాలి. నీరు రోజులో సరైన క్రమంలో తీసుకుంటే.. అతివేడి సమస్య తగ్గుతుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలసట తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా.. నీరు సరైన మోతాదులో తీసుకుంటే కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్య కూడా తగ్గుతుంది.

Also Read: Anushka Shetty: బరువు తగ్గే పనిలో భాగమతి.. ఇందుకోసం ఏయే చిట్కాలు పాటిస్తుందంటే..

RRR: ఇది మాములు మాస్‌ కాదు.. ఊర మాస్‌. ట్రాఫిక్‌లో ఆర్‌.ఆర్‌.ఆర్‌ పాటకు స్టెప్పులు.. వైరల్‌ వీడియో..