AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Foods: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ డ్రైఫ్రూట్స్, సీడ్స్‏ను తీసుకోండి.. అవెంటంటే..

ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది బయటి ఫుడ్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగ హడావిడిలో పడి తీసుకునే

Healthy Foods: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ డ్రైఫ్రూట్స్, సీడ్స్‏ను తీసుకోండి.. అవెంటంటే..
Winter Healthy Foods
Rajitha Chanti
|

Updated on: Nov 15, 2021 | 7:50 PM

Share

ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది బయటి ఫుడ్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగ హడావిడిలో పడి తీసుకునే ఆహారంపై సరైన దృష్టి సారించడం లేదు. దీంతో అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారు. అలాగే మారుతున్న సీజన్లలోనూ అహారపు అలవాట్లు.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో తీసుకునే ఆహారం పై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ కాలంలో శరీరం ఎక్కువగా చల్లగా అయిపోతుంది. అందుకే వీలైనంతవరకు శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. అందుకే శరీరానికి తగినంత ఉష్ణోగ్రతను అందించే డ్రైఫ్రూట్స్.. సీడ్స్ తీసుకోవాలి. మరీ అవెంటో తెలుసుకుందామా.

* చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు సరైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇందుకు వాల్ నట్స్ ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాల్ నట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యాన్సర్ తో పోరాడే గుణాలు ఉంటాయి. * వేరుశనగలో జింక్, ఫైబర్, ప్రోటీన్, ఇతర ఖనిజాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలోనూ సహాయపడతాయి. అలాగే గుండెజబ్బులను.. కిడ్నీలో రాళ్ల సమస్యలను తగ్గిస్తాయి. * గుమ్మడి గింజలు యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం, మాంగనీస్, జింక్, ఐరన్, రాగి, అనేక ఇతర ఖనిజాల, విటమిన్లు ఉంటాయి. ఇవి రక్తహీనతను నియంత్రిస్తాయి. * నువ్వులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో జింక్, కాపర్, కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చలికాలంలో ఆరోగ్యానికి చాలా మంచివి. * బాదంపప్పులో విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రొటీన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, గుండె ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్నాయి, ఇవి మీ గుండెకు చాలా మేలు చేస్తాయి. చలికాలంలో ఆకుకూరలను తప్పక తీసుకోవాలి. వీటిలో ఏ, సీ, కే విటమిన్లు అధికంగా ఉంటాయి. ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్స్‌ కూడా కావాల్సినంత ఉంటాయి. రోజూ ఆకుకూరలను తీసుకోవడం ద్వారా శరీరంలో ఎర్ర రక్తకణాలు వృద్ధి అవుతాయి.

Also Read:  ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు.. ఎన్ని గ్లాసుల నీరు తాగాలో తెలుసా..  ప్రయోజనాలు తెలుసుకోండి..

Samantha in Pushpa: అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది.. పుష్పరాజ్‏తో స్టెప్పులేయనున్న సమంత…

Radhe Shyam: రాధేశ్యామ్ చిత్రయూనిట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నిద్రపోతున్నావా అంటూ కామెంట్స్..