Anushka Shetty: బరువు తగ్గే పనిలో భాగమతి.. ఇందుకోసం ఏయే చిట్కాలు పాటిస్తుందంటే..

తెలుగు సినిమా పరిశ్రమలో మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది అనుష్క. ఓవైపు గ్లామర్‌ పాత్రలు చేస్తూనే 'అరుంధతి', 'రుద్రమదేవి', 'భాగమతి', 'నిశ్శబ్ధం' తదితర

Anushka Shetty: బరువు తగ్గే పనిలో  భాగమతి.. ఇందుకోసం ఏయే చిట్కాలు పాటిస్తుందంటే..

తెలుగు సినిమా పరిశ్రమలో మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది అనుష్క. ఓవైపు గ్లామర్‌ పాత్రలు చేస్తూనే ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’, ‘నిశ్శబ్ధం’ తదితర సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా, సినిమాకు వైవిధ్యం చూపే అనుష్క అందుకోసం ఎంతో తాపత్రయపడుతుంటారు. ‘సైజ్‌ జీరో’ సినిమాలోని పాత్ర కోసం భారీగా బరువు పెరగడమే ఇందుకు నిదర్శనం. అయితే ఇదే ఆమెకు కొంచెం నెగెటివ్‌గా మారింది. ఈ క్రమంలో తన కొత్త సినిమా కోసం బరువు తగ్గే పనిలో ఉందట స్వీటీ. మునపటిలా సన్నగా, నాజూగ్గా మారేందుకు ప్రయత్నిస్తోందంట. ఇందులో భాగంగా డైటీషియన్‌ సూచనల మేరకు కొన్ని చిట్కాలు పాటిస్తుందట.

8 గంటల్లోపే డిన్నర్‌.. స్లిమ్‌గా మారేందుకు నీళ్లను ఎక్కువగా తీసుకుంటోందట అనుష్క. అలాగే మధ్యమధ్యలో కొబ్బరి నీళ్లను కూడా తీసుకుంటోంది. దీని వల్ల బరువు తగ్గడమే కాకుండా చర్మం కూడా ప్రకాశవంతంగా మారుతుందని చెబుతోంది స్వీటీ. కూరగాయలు, ముఖ్యంగా ఫైబర్‌ పుష్కలంగా ఉండే వెజిటబుల్స్‌ను తన మెనూలో ఉండేట్లు జాగ్రత్త పడుతోందట. ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోకుండా మధ్యమధ్యలో గ్యాప్‌ ఇస్తూ రోజులో కనీసం 5, 6 సార్లు ఆహారం తీసుకుంటుందట. ఎంత బిజీగా ఉన్నా రాత్రి 8 గంటల్లోపే డిన్నర్‌ను పూర్తి చేసేలా నియమం పెట్టుకుందట ఈ ముద్దుగుమ్మ. బయటి ఆహారం పూర్తిగా తగ్గించి ఇంట్లో తయారుచేసిన ఆహారానికే ప్రాధాన్యమిస్తోందట. అదేవిధంగా నూనెతో తయారుచేసిన పదార్థాలను, కార్బొహైడ్రేట్స్‌ కలిగిన పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకుంటోందట. ఆహార నియమాలతో క్రమం తప్పకుండా యోగా, రెగ్యులర్‌ ఎక్సర్‌సైజులు చేస్తోందట.

Also Read:

RRR: ఇది మాములు మాస్‌ కాదు.. ఊర మాస్‌. ట్రాఫిక్‌లో ఆర్‌.ఆర్‌.ఆర్‌ పాటకు స్టెప్పులు.. వైరల్‌ వీడియో..

Varun Tej: మెగా ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌.. ‘గని’కి మాట సాయం చేస్తోన్న మెగా పవర్‌ స్టార్‌..

Actor Suriya: రియల్ సినతల్లి పేరుతో రూ.10 లక్షలు డిపాజిట్ చేసిన హీరో సూర్య.. ఇల్లు కట్టిస్తానన్న లారెన్స్..

Published On - 9:05 am, Mon, 15 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu