AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఆరోగ్య సమస్యలు దూరం కావాలంటే వీటిని రాత్రంతా నానబెట్టి తినాలి..

మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో కసరత్తులు చేస్తాం. గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్ చేయడం, నీళ్లు ఎక్కువగా తాగడం మొదలైనవి. కానీ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి సరైన ఆహారం అవసరమని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం....

Health: ఆరోగ్య సమస్యలు దూరం కావాలంటే వీటిని రాత్రంతా నానబెట్టి తినాలి..
Srinivas Chekkilla
|

Updated on: Nov 15, 2021 | 2:39 PM

Share

మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో కసరత్తులు చేస్తాం. గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్ చేయడం, నీళ్లు ఎక్కువగా తాగడం మొదలైనవి. కానీ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి సరైన ఆహారం అవసరమని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. ఈ ఆరోగ్యకరమైన ఆహారాల్లో కొన్ని మీరు ఉదయం నానబెట్టిన తినాల్సిన కూడా ఉంటాయి. కడుపు సమస్యలు, రోగనిరోధక శక్తి, బరువు తగ్గడం ఆర్థరైటిస్ వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవటానికి కింది వాటిని నానబెట్టుకుని తినాలి..

మెంతికూర మెంతులు రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఆ నీళ్లు కూడా తాగాలి. ఇలా చేయడం వల్ల ఈ రోజుల్లో మహిళల్లో సాధారణ సమస్య అయిన కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. మెంతి గింజలు కడుపుకు కూడా మేలు చేస్తాయి. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగులను శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతులు చాలా మేలు చేస్తాయి. ఇది ఋతు నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఎండుద్రాక్ష ఎండుద్రాక్షలో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎండుద్రాక్షను రాత్రిపూట నానబెట్టి, ఉదయం వాటిని తింటే, మీ చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. చాలా మంది మహిళలు ఐరన్ లోపాన్ని ఎదుర్కొంటారు. ఎండుద్రాక్ష తినడం వల్ల ఐరన్ పెరుగుతుంది.

అవిసె గింజలు 1 టీస్పూన్ ఫ్లాక్స్ సీడ్ మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినండి. ఈ గింజల్లో ఫైబర్, ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతాయి. ఈ విత్తనాలను రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ విత్తనాలు క్యాన్సర్, మధుమేహం నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తాయి.

బాదం ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన బాదంపప్పును తినడం వల్ల మీ మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాదంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలతో వ్యవహరించే వారికి సహాయపడుతుంది. నానబెట్టిన బాదం కూడా బరువు తగ్గడానికి చాలా మంచిది.

అత్తి అత్తి పండ్లలో విటమిన్లు, మాంగనీస్, పొటాషియం, ఫైబర్ మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. అత్తి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తాయి. 1 అత్తి పండు రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినండి.

Read Also.. Ghee and Oil: బరువు పెరుగుతున్నామని నెయ్యి.. నూనెలను దూరం పెట్టేస్తున్నారా? అయితే, మీకు అనారోగ్యం ఖాయం ఎలా అంటే..