Ghee and Oil: బరువు పెరుగుతున్నామని నెయ్యి.. నూనెలను దూరం పెట్టేస్తున్నారా? అయితే, మీకు అనారోగ్యం ఖాయం ఎలా అంటే..
ఇది మీకు తెలుసా? నెయ్యి.. నూనె లేకుండా ఆహారం తినడం వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు. మీరు విన్నది నిజమే. ఆహారంలో నూనె, నెయ్యి వంటి పదార్ధాలు తీసుకోకపోవడం అనారోగ్యానికి కారణంగా మారుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Ghee and Oil: ఇది మీకు తెలుసా? నెయ్యి.. నూనె లేకుండా ఆహారం తినడం వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు. మీరు విన్నది నిజమే. ఎలాగంటే.. ప్రస్తుత కాలంలో బరువు పెరుగుతుందనే భయంతో నెయ్యి నూనెను పూర్తిగా వదులుకున్న వారు చాలా మంది ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఫిట్‌నెస్ పట్ల చాలా మంది మారుతున్న వైఖరి కారణంగా, నూనె, నెయ్యి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుందనే భయం అందరినీ వెంటాడుతోంది. దీని కారణంగా చాలామంది తమ ఆహారంలో వాటిని నివారించడం ప్రారంభించారు. ఉడికించిన ఆహారాలు లేదా పండ్లను మాత్రమే తీసుకోవడం ప్రారంభించారు. అయితే, ఒక పరిశోధన ప్రకారం, ఆహారంలో కొవ్వును అస్సలు తీసుకోకపోవడం వల్ల, రాబోయే కాలంలో వీరు తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారు.
గత కొన్నేళ్లుగా టీనేజర్లు, యువతలో సోషల్ మీడియాలో వచ్చే దాదాపు ప్రతి కంటెంట్ పెద్ద ప్రభావాన్ని చూపింది. అందుకే వారు తమ ఆరోగ్యానికి సంబంధించిన..బరువు తగ్గించే పదార్థాలను వాస్తవాలను తెలుసుకోకుండా వారి ఆహారంలో చేర్చుకుంటారు. ఈ పద్ధతుల ద్వారా వారు బరువు పెరగకపోవచ్చు. కానీ, వారు కచ్చితంగా ఇతర సమస్యలను ఆహ్వానిస్తారు. కాబట్టి మన ఆహారంలో తగినంత పరిమాణంలో నూనె ఉండాలని నిపుణులు అంటున్నారు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.
• మన ఆహారంలో నెయ్యి-నూనెను సరైన మొత్తంలో తీసుకోకపోవడం వల్ల మన మెదడు, నాడీ వ్యవస్థను ప్రమాదంలో పడుతుంది. దీని ఫలితంగా మెదడు సరిగ్గా పనిచేయదు. అంటే, కొన్నిసార్లు మీరు ఏదో చెప్పాలనుకుంటారు కానీ బయటకు చెప్పేటప్పుడు మరొకటి చెబుతారు. శరీరంలో సరైన కొవ్వు లేకపోవడం మన జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది. అలాగే శరీరాన్ని బలహీనపరుస్తుంది లేదా మానసిక కల్లోలం కలిగిస్తుంది. అందువల్ల, వైద్యులు కొవ్వులు, నూనెలను తగినంత మొత్తంలో తినాలని కూడా సిఫార్సు చేస్తారు.
• మన శరీరాలను అనవసరమైన ఒత్తిడికి గురిచేసే ఫీడ్ డైట్‌లను నిపుణులు తీసుకోకూడదని నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. కొన్నిసార్లు కొంతమంది హృద్రోగులు లేదా రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు నెయ్యి లేదా ఆవాలు లేదా ఆలివ్ నూనె వంటి ఆరోగ్యకరమైన నూనెలను వారి ఆహారం నుండి పూర్తిగా పక్కకు పెట్టేస్తారు. అయితే అలా చేయడం ద్వారా వారు వారి గుండె ప్రమాదాన్ని మరింత పెంచుకుంటారని నిపుణులు అంటారు. ఎందుకంటే శరీరానికి కొవ్వు అవసరం. మన మెదడు, మన నాడీ వ్యవస్థ, మెదడు, ప్రసరణ వ్యవ, మన నరాలు అన్నీ కొవ్వు ఆధారంగా పనిచేస్తాయి. మీరు దానిని తప్పనిసరిగా తొలగించవలసి వస్తే, మీ ఆహారం నుండి ట్రాన్స్‌ఫ్యాట్‌లను, అంటే జంక్ ఫుడ్ లేదా స్ట్రీట్ ఫుడ్‌ను నివారించండి. ఆరోగ్యకరమైన కొవ్వును అందించే పదార్ధాలను డైట్ లో చేర్చుకోండి.
• వైద్యులు చెబుతున్నదాని ప్రకారం మరొక వాస్తవం ఏమిటంటే, విటమిన్ ఎ, డి, కె, ఇ మొదలైన కొన్ని కొవ్వులో కరిగే విటమిన్లు ఉన్నాయి. ఇవి జీవక్రియ పెరుగుదలకు చాలా ముఖ్యమైనవి. మీరు వాటిని తగినంత పరిమాణంలో తీసుకోకపోతే, మీకు అనేక ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఈ విటమిన్ల లోపం మన శరీరంలోని జీవక్రియ కార్యకలాపాలను నెమ్మదిస్తుంది. దీని ఫలితంగా ఆలోచనా శక్తి తగ్గడం, రక్తస్రావం, నెమ్మదిగా నిర్వహణ లేదా అవయవాల బలహీనత వంటి ఇతర సమస్యలు మొదలవుతాయి.
ఇవి కూడా చదవండి: Corona Vaccine: కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ పెంచాల్సిన అవసరం లేదు.. స్పష్టం చేసిన నిపుణులు!