Corona Children: బాల్యం బరువెక్కింది.. చిన్నారులపై కరోనా ప్రభావం.. సర్వేలో షాకింగ్ విషయాలు..

Corona: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. కంటికి కనిపించని మాయదారి రోగం దేశా ఆర్థిక వ్యవస్థలు సైతం షేక్ అయ్యాయి. ఇక ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపిందో..

Corona Children: బాల్యం బరువెక్కింది.. చిన్నారులపై కరోనా ప్రభావం.. సర్వేలో షాకింగ్ విషయాలు..
Corona Kids
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 15, 2021 | 11:39 AM

Corona: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. కంటికి కనిపించని మాయదారి రోగం దేశా ఆర్థిక వ్యవస్థలు సైతం షేక్ అయ్యాయి. ఇక ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా సోకిన వారే కంటే ఇతరులపై కూడా దీని ప్రభావం పడింది. ముఖ్యంగా కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఇది ప్రజల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపింది. ఇదిలా ఉంటే నిత్యం ఆటలు ఆడుతూ, బయట తిరిగే చిన్నారులు కూడా లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఇది చిన్నారుల్లో ఊబకాయానికి దారి తీసిందని వైద్యుల సర్వేలో తేలింది. దేశరాజధాని న్యూఢిల్లీలో ఉన్న సర్‌ గంగారామ్‌ అనే ఆసుపత్రి నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

సర్వేలో భాగంగా సుమారు 1309 చిన్నారులను పరిగణలోకి తీసుకున్నారు. సర్వేలో పాల్గొన్న తల్లిదండ్రుల్లో 60 శాతం మంది.. తమ పిల్లలు 10 శాతం బరువు పెరిగారని చెప్పుకొచ్చారు. శారీక శ్రమ లేకపోవడం, నిత్యం ఇంట్లోనే ఉంటూ, ఫాస్ట్‌ఫుడ్‌ లాంటివి తీసుకోవడం వల్లే తమ పిల్లలు బరువు పెరిగారని వారు తెలిపారు. ఇక పిల్లల్లో ఒత్తిడి, నిద్రలో తీవ్రమైన మార్పులు, ఆహారపు అలవాట్లు మారినట్లు వైద్యులు గుర్తించారు. ఇదిలా ఉంటే ముంబైలోని వైద్యులు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ముంబైకి చెందిన ఆసుపత్రి 7,670 మంది తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసి పిల్లలపై కోవిడ్‌ ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకున్నారు. 5 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల పేరెంట్స్‌ అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఇందులో మెజారిటీ తల్లిదండ్రలు తమ పిల్లలు లాక్‌డౌన్‌ సమయంలో ఫోన్‌, టీవీలకు ఎక్కువగా అలవాటు పడ్డారని తెలిపారు. మూడింట ఒక వంతు పేరెంట్స్‌ తమ చిన్నారులు బరువు పెరిగినట్లు తెలిపారు.

అంతేకాకుండా లాక్‌డౌన్‌ సమయంలో 10 మందిలో 6గురు చిలన్నారుల్లో మునుపటితో పోలిస్తే కోపం, చిరాకు పెరిగిందని తేలింది. 60 శాతం పేరెంట్స్‌ తమ చిన్నారుల్లో కోపం పెరిగిందని తెలిపారు. కరోనా సమయంలో పిల్లలు ఆటలకు దూరం కావడం, స్నేహితులతో కలవకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉండడంతో స్మార్ట్‌ ఫోన్లకు కూడా బాగా అలవాటు పడిపోయారని సర్వేలో తేలింది. చిన్నారులు రోజుకు నాలుగు నుంచి ఆరు గంటలపాలు ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌తో గడిపారని పేరెంట్స్‌ చెప్పుకొచ్చారు.

Also Read: Viral Video: ‘హీరోయిన్‌కు ఏ మాత్రం తక్కువ కాదు’.. అదిరిపోయిన నవ వధువు డ్యాన్స్ వీడియో

World’s oldest Cake: వందల ఏళ్లనాటి కేకు.. ఇంకా తాజాగానే ఇంగ్లండ్‌లో తవ్వకాల్లో గుర్తించిన అధికారులు.. (వీడియో)

Uttar Pradesh: దేశంలో తొలిసారిగా గోవులకు అంబులెన్స్‌.. ఎక్కడంటే..