The Great Resignation: పెను సంక్షోభం దిశగా అమెరికా.. 44 లక్షల మందికి పైగా ఉద్యోగులు రాజీనామా..

The Great Resignation: కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం నుంచి ప్రపంచ దేశాలు ఇంకా కోలుకోలేదు.కోవిడ్ -19 మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తం గా ఆర్థిక మందగమనానికి..

The Great Resignation: పెను సంక్షోభం దిశగా అమెరికా.. 44 లక్షల మందికి పైగా ఉద్యోగులు రాజీనామా..
The Great Resignation
Follow us
Surya Kala

|

Updated on: Nov 15, 2021 | 9:55 AM

The Great Resignation: కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం నుంచి ప్రపంచ దేశాలు ఇంకా కోలుకోలేదు.కోవిడ్ -19 మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తం గా ఆర్థిక మందగమనానికి కారణమైంది. కోవిడ్ అగ్రరాజ్యం అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీని ప్రభావంతో అమెరికా ఆర్ధిక, ప్రాణ సహా అనేక రంగాలపై తీవ్ర స్థాయి పడింది. కరోనా కోరల్లో చిక్కుకున్న అమెరికా ఇంకా విలవిలాడుతూనే ఉంది. తాజాగా అగ్రరాజ్యం పెను సంక్షోభం దిశగా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. యునైటెడ్ స్టేట్స్‌లో ‘ది గ్రేట్ రిజైన్‌నేషన్’ కొనసాగుతోంది. సెప్టెంబరులో 4.4 మిలియన్ల మంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టారని యుఎస్ లేబర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. కోవిడ్-19 బారిన పడతామనే భయంతో కొందరు వ్యక్తులు తమ ఉద్యోగాలకు రాజీనామా ఇస్తున్నారని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

కరోనా వలన ఇప్పటికే పలు రంగాలు మూతబడ్డాయి. దీంతో అందులో పనిచేసేవారు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థలు కూడా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాయి. తమ సంస్థలో ఏళ్ల తరబడిన పనిచేస్తున్న ఉద్యోగస్తులను తొలగిస్తున్నారు.. లేదా జీతాల్లో కోతలు విధిస్తున్నారు. దీంతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.  ఉద్యోగస్తులను తొలగిస్తుండడంతో.. చాలా సంస్థల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో చాలా సంస్థలు తమకు తగిన ఉద్యోగస్తుల కోసం అన్వేషిస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఉద్యోగస్తులు అమెరికా కంపెనీలకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ది గ్రేట్ రిజిగ్నేషన్ పేరుతో పలు సంస్థలలో ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకూ సుమారు 44 లక్షల మందికి పైగా రాజీనామా చేసినట్లు సమాచారం. అంతేకాదు రాజీనామా చేసిన ఉద్యోగులు తమకు మంచి జీతం ఇచ్చే సంస్థల కోసం అన్వేషిస్తున్నట్లు అక్కడి కార్మిక శాఖ తెలిపింది.

అమెరికాలో ఉద్యోగులు భారీ సంఖ్యలో రాజీనామాలు చేయడంతో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. అదే సమయంలో  అమెరికా వ్యాప్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో పండుగ రోజులు రానున్న నేపధ్యంలో పలు సంస్థలు అధిక వేతనాలు ఇచ్చయినా సరే ఉద్యోగాలు భర్తీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.  అయితే ప్రస్తుతం ఉద్యోగం చేయాలనుకునే వారు తక్కువమంది ఉండడంతో.. యజమానులు ఉద్యోగులను నియమించుకోవడం చాలా కష్టమవుతుందని సంస్థ యజమానులు చెబుతున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లు ,  రిటైల్ సంస్థలు, వ్యక్తిగత సేవా ఉద్యోగాలతో రూపొందించబడిన పరిశ్రమలు, చిన్న చిన్న కర్మాగారాల్లో శ్రామికశక్తి క్షీణత తీవ్రంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:  ఫైల్స్ నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఉల్లికాడలను ఇలా తీసుకుంటే..శాశ్వత పరిష్కారం..