Uttar Pradesh: దేశంలో తొలిసారిగా గోవులకు అంబులెన్స్.. ఎక్కడంటే..
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం గోవుల సంరక్షణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోన్న సంగతి తెలిసిందే
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం గోవుల సంరక్షణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యోగి ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా గోవుల కోసం అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈమేరకు అనారోగ్యంతో బాధపడుతున్న గోవులను అంబులెన్స్‌ల్లో ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందించనున్నట్లు రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి, పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి తెలిపారు. యూపీ సర్కారు ప్రారంభిస్తోన్న ఈ పథకం దేశంలోనే మొదటిదని మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఫోన్ చేసిన 15 నిమిషాల లోపే.. ఈ పథకంలో భాగంగా మొత్తం 515 అంబులెన్స్‌లను సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా అంబులెన్స్ సర్వీసుల కోసం ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గోవులకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ఎమర్జెన్సీ సర్వీసు నంబర్ ‘112’కు ఫోన్ చేయాలన్నారు. కాల్ చేసిన 15 నుంచి 20 నిమిషాల్లోపు వెటర్నరీ డాక్టర్, ఇద్దరు సహాయకులతో కూడిన అంబులెన్స్ ఇంటి దగ్గరకు వస్తుందన్నారు. డిసెంబర్ నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందని, మథురతో సహా ఎనిమిది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడతామని మంత్రి వివరించారు.
Also Read:
Kishan Reddy: భారత దేశ కళలను గుర్తించండి.. దేవాలయాలపై శిల్ప కళ అద్భుతం..