World’s oldest Cake: వందల ఏళ్లనాటి కేకు.. ఇంకా తాజాగానే ఇంగ్లండ్‌లో తవ్వకాల్లో గుర్తించిన అధికారులు.. (వీడియో)
పురావస్తు తవ్వకాల్లో ఎన్నో వస్తువులు బయటపడటం మనం చూస్తుంటాం.. కానీ, తాజాగా ఎన్నో ఏళ్ల క్రితం తయారు చేసిన ఓ కేకు తవ్వకాల్లో బయటపడటం, అది ఇంకా తాజాగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా కొన్ని రకాల ఆహార పదార్ధాలు....
పురావస్తు తవ్వకాల్లో ఎన్నో వస్తువులు బయటపడటం మనం చూస్తుంటాం.. కానీ, తాజాగా ఎన్నో ఏళ్ల క్రితం తయారు చేసిన ఓ కేకు తవ్వకాల్లో బయటపడటం, అది ఇంకా తాజాగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా కొన్ని రకాల ఆహార పదార్ధాలు మహా అంటే ఓ వారం రోజులు నిల్వ వుంటాయి. కానీ ఇవాళ చేస్తే మర్నాడుకి పాడయిపోయే కేక్ ఏళ్ల తరబడి తాజాగా ఎలా ఉందో ఎవరికీ అంతు చిక్కడంలేదు. అది ఎక్కడో ఏంటో.. తెలుసుకుందాం..
ఇంగ్లండ్‌లో జరిపిన పురావస్తు తవ్వకాల్లో దహనమైపోయిన ఓ ఇంట్లో ఈ కేకు బయట పడింది. దాని పక్కనే ఓ కత్తి, నాలుగు స్పూన్లు కూడా దొరికాయి. దాంతో ఆ ఇంట్లో ఏదో ఒక వేడుక విషాదంతంగా ముగిసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఆ కేకు తాజాగా ఉండటమే కాదు.. దానిపై చాక్లెట్ చిప్స్‌తో చేసిన గార్నిషింగ్ చెక్కు చెదరకుండా ఉంది. ఆ ఇల్లు జోహాన్ వార్మ్ అనే వ్యక్తిదిగా గుర్తించారు పరిశోధకులు. అయితే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లండ్‌లో వందలాది ఇళ్లు మంటల్లో దగ్ధమైపోయాయని, అందులో ఈ ఇల్లు కూడా ఒకటై ఉంటుందని పురావస్తు అధికారులు తెలిపారు. అయితే ఈ కేకులో ఎలాంటి రసాయనాలు గుర్తించలేదని తెలిపిన అధికారులు ఇంత కాలం తాజాగా ఉండటానికి గల కారణం, త్వరలోనే కనుగొంటామని చెప్పారు.
మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..
Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…
Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

