Aloe Vera Side Effects: కలబందను తెగ వాడేస్తున్నారా ? అయితే ఈ విషయాలను తెలుసుకోండి..
కలబంద (Aloe Vera) వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చర్మం.. జుట్టు సమస్యలను తగ్గించడంలోనూ

కలబంద (Aloe Vera) వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చర్మం.. జుట్టు సమస్యలను తగ్గించడంలోనూ కలబంద ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా..ముఖ సౌందర్యాన్ని పెంచడానికి కలబంద ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఇటీవల కాలంలో దీనిని ఎక్కువగా తినేస్తున్నారు. కలబందను ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. దీనిని మితిమీరి తినడం వలన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కలబందను తినేముందు వైద్యుడి సలహాలు తీసుకోవాలి. దీనిని ఎక్కువగా తినడం వలన కలిగే సమస్యలు ఎంటో తెలుసుకుందామా..
కలబందను అధికంగా తీసుకోవడం వలన చర్మం అలెర్జీ వస్తుంది. దీంతో దద్దుర్లు, చర్మం ఎర్రగా కావడం.. చికాకు పుట్టడం .. దురద వంటి సమస్యలు కలుగుతాయి. చాలా మంది బరువు తగ్గడానికి ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద రసాన్ని తీసుకుంటారు. ఇలా చేయడం వలన డీహైడ్రేషన్ కూడా వస్తుంది. దీనివలన అలసట.. వికారం వంటి సమస్యలు వస్తాయి.
కలబందను ఎక్కువ కాలం తీసుకోవడం వలన విరేచనాల సమస్య వస్తుంది. ఇందులో ఎక్కువగా భేదిమందు లక్షణాలు ఉన్నాయి. ఇది మీ ఐబీఎస్ సమస్యను మరింత పెంచుతాయి. కలబంద రసంలో ఆంత్రాక్వినోన్ అనే ద్రవం కూడా ఉంటుంది. ఇది భేదిమందు.. దీనివలన కడుపు నొప్పి, వాంతులు.. విరేచనాలు వంటి సమస్యలు కలుగుతాయి. కలబంద రసాన్ని ఎక్కువ కాలం పాటు తీసుకోవడం వలన శరీరంలో పొటాషియం తగ్గుతుంది. దీంతో మీరు ఎక్కువగా భయాందోళనకు గురవుతారు. అలాగే బలహీనంగా మారుతారు. అందుకే కలబందను అధికంగా తీసుకోవద్దు.
గమనిక:- ఈ కథనంలో ప్రచురించబడిన సమాచారం కేవలం నివేదికలు.. నిపుణుల అందించిన సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది. పూర్తి వివరాల కోసం ముందుగా వైద్యుడిని సంప్రదించాలి.
Gangubai Kathiawadi: థియేటర్లలోకి గంగూబాయి కతియావాడి.. అలియా భట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..




