AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omega -3: ఈ ఐదు రకాల పదార్థాలలో ఒమేగా-3 అధికం.. ఆ విషయాలలో అద్భుతమైన ఫలితాలు..!

Omega -3: ప్రస్తుతం ఉన్న రోజుల్లో వివిధ రకాల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తీసుకునే ఆహారం, వాతావరణంలో మార్పుల,..

Omega -3: ఈ ఐదు రకాల పదార్థాలలో ఒమేగా-3 అధికం.. ఆ విషయాలలో అద్భుతమైన ఫలితాలు..!
Subhash Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 29, 2022 | 9:29 AM

Share

Omega -3: ప్రస్తుతం ఉన్న రోజుల్లో వివిధ రకాల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తీసుకునే ఆహారం, వాతావరణంలో మార్పుల, కాలుష్యం తదితర కారణాలు వల్ల వివిధ రకాల వ్యాధులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి కూడా ముఖ్య కారణంగా మారుతోంది. ఇక రోగనిరోధక శక్తి పెంచుకుంటూ వైరస్‌లు దాడి చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఒమేగా-3 ఉండే ఆహారం తీసుకున్నట్లయితే ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లం మంచి కేలరిలను అందిస్తుంది. మీ శరీరానికి శక్తిని ఇస్తుంది. గుండె పనితీరు మెరుగు పరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పరుస్తుంది. అయితే మన శరీరంలో ఉత్పత్తి చేసే అనేక రకాల కొవ్వులు ఉన్నాయి. ఒమేగా-3 ముఖ్యమైనది.

మనం ఆరోగ్యంగా ఉంటే మన శరీరం, మెదడు చక్కగా పనిచేస్తాయి. అలాగే సంతోషంగా కూడా ఉంటాం. ఇలా ఉండాలంటే మనం సరైన ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మన శరీరం సరిగ్గా పని చేసే తీరుకు చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి ఒమేగా-3 తీసుకోవడమే. ఒమేగా తీసుకోవడం వల్ల మన గుండె, చర్మం, మెదడు ఆరోగ్యం బాగా ఉంటుంది. అందుకే ఒమేగా త్రీ ఉన్న ఆహారం మీ ప్రతి రోజు భోజనం లో భాగం చేసుకుంటే ఎంతో మంచిదంటున్నారు వైద్యనిపులు. అయితే చేపల్లో ఈ ఒమేగా అనే పదార్థం అధికంగా ఉంటుంది.

అవిసె గింజలు :

అవిసె గింజలు, చియా విత్తనాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ విత్తనాలు ఇనుము, మెగ్నీషియం, ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్‌తో పోరాడానికి ఉపయోగపడుతుంది.

వాల్‌నట్స్‌ :

వాల్‌నట్స్‌లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లలు అధిక సంఖ్యలో ఉంటాయి. దట్టంగా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. గుండె పనితీరుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయి, కొలెస్ట్రాల్‌ స్థాయిలను మెరుగు పరుస్తాయి.

చేపలు :

చేపల్లో కూడా ఒమేగా-3 అధిక శాతం ఉంది. చేపలు తినడం వల్ల చాలా బెనిఫిట్‌ ఉంటుంది. చేపల్లో ఒమేగా అధిక సంఖ్యలో ఉండడమే కాకుండా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి కండరాల పునరుత్పత్తికి ఉంతగానో ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి పెంపొందడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి.

సోయాబీన్స్‌

సోయాబీన్స్ లో ఒమేగా-3 ఉంటుంది. ఫైబర్‌, ప్రోటీన్లుకు సోయా మంచి ఆహారం. సోయాబీన్స్‌ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల నుంచి రక్షించుకోవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

బ్లూబెర్రీస్‌:

బ్లూబెర్రీస్‌లో కేలరీలు అధిక సంఖ్యలో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. గుండె జబ్బులకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. రక్తపోటు నుంచి కాపాడుతాయి. ఒమేగా-3 సప్లిమెంట్స్‌ ఉంటాయి. అవి తినడం వల్ల ఎంతగానో మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి:

Cardamom Cultivation: యాలకులు ఎక్కువగా ఎక్కడ పండిస్తారు..? ధర ఎక్కువగా ఎందుకు ఉంటుంది..?

Women Health Tips: మహిళలు ఆ సమస్యలు దూరం కావాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోవాల్సిందే..!