AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cardamom Cultivation: యాలకులు ఎక్కువగా ఎక్కడ పండిస్తారు..? ధర ఎక్కువగా ఎందుకు ఉంటుంది..?

Cardamom Cultivation: ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో యాలకులు (Cardamom) కూడా ఒకటి. ఒక కిలో ప్యాకెట్‌ను కొనుగోలు..

Cardamom Cultivation: యాలకులు ఎక్కువగా ఎక్కడ పండిస్తారు..? ధర ఎక్కువగా ఎందుకు ఉంటుంది..?
Subhash Goud
| Edited By: |

Updated on: Jan 28, 2022 | 9:57 AM

Share

Cardamom Cultivation: ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో యాలకులు (Cardamom) కూడా ఒకటి. ఒక కిలో ప్యాకెట్‌ను కొనుగోలు చేయాలంటే ఎంతో ధర పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే యాలకులు ఎంత ఖరీదైనా సరే కొనుగోలు చేస్తుంటారు. టీ (Tea)లో వేసే మొదలు వివిధ రకాల స్వీట్లు (Sweets), వంటకాల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. యాలకులను సుగంధ ద్రవ్యాల రాణి అని కూడా పిలుస్తుంటారు. ఆయుర్వేధంలో కూడా వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. యాలకుల ధర ఎక్కువగా ఉండడానికి కారణాలు కూడా ఉన్నాయి. వీటిని సాగు చేయడంలో ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. ఒక కిలో యాలకులు అవసరమైతే ఆరు కిలోల వరకు ముడి గింజలు అవసరం ఉంటాయి. అంటే చెట్టు నుంచి ఆరు కిలోల యాలకులు తీయగా, దాని నుంచి సుమారు కిలో యాలకులు మాత్రమే బయటకు వస్తాయి. యాలకులు చిన్న ఓవల్‌ ఆకారంలో ఉండే పండు నుంచి వస్తాయి.

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో సాగు..

యాలకులు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాగవుతుంది. ఇందులో భారతదేశంలో కూడా సాగు అవుతుంది. పంట సాగు కూడా చాలా కాలం కొనసాగుతుంది. దాని నుంచి పండ్లు చాలా కాలం పాటు పెరుగుతాయి. వీటిని పాడ్‌ అని కూడా అంటారు. వ్యవసాయ శాఖ ప్రకారం.. యాలకుల మొక్కలు నీటి ఒత్తిడిని ఏమాత్రం తట్టుకోలేవు. అందువల్ల నేలలో క్రమం తప్పకుండా తేమ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నాలుగు రోజులకు ఒకసారి నీరు పెడితే సరిపోతుంది. అయితే యాలకులు కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు ఆకుపచ్చ, పసుపు రంగులోకి మారుతాయి. అప్పుడు వాటిని చిన్న కత్తెరతో కట్ చేసి కొమ్మతో పాటు సేకరించాలి. 5 నుంచి 6 రోజుల వరకు ఆరబెట్టడం ముఖ్యం. అప్పుడప్పుడు వాటిని కదిలించుతూ ఉండాలి. వాటిని పగులగొట్టే పని చాలా రోజుల పాటు కొనసాగుతుంది. వీటి కోసం ప్రత్యేక కార్మికులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. అలాగే యాలకుల పండ్లు తెంచడానికి యంత్రాలు అవసరం ఉండదు. కూలీలు మాత్రమే తెంచాల్సి ఉంటుంది. ఒక హెక్టారు సాగులో 5-7 కిలోల యాలకులు మాత్రమే ఉత్పత్తి అవుతాయి. ఇలా పని ప్రాసెంగ్‌ ఎక్కువ ఉండటం వల్ల, అందులో ఇతర దేశాల్లో పంట సాగు చేయడం వల్ల ఇవి ఎక్కువ ధర కలిగి ఉంటుంది.

యాలకుల సాగుకు రేగడి నెలలు అనుకూలం..

యాలకుల సాగుకు సారవంతమైన అడవి రేగడి నేలలు దీనికి అనుకూలం. అలాగే ఈ పంట నీటి ముంపును తట్టుకోలేదు. అందుకే ఈ పంటలో నీరు నిలువకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సముద్ర మట్టం నుంచి 600-1200 మీటర్ల ఎత్తు వరకు ఈ పంటను పండించవచ్చు. ఉష్ణోగ్రత 10 డిగ్రీల నుంచి 35 డిగ్రీల సెల్సియస్‌ అవసరం అవుతుంది.

సుగంధ ద్రవ్యాల్లో యాలకులకు ఓ ప్రత్యేకత ఉంది. దీని వాసన ఎంతో పరిమళంగా ఉంటుంది. మన పూర్వీకులు వీటిని ఆయుర్వేదంలో విరివిగా వాడేవారు. ఆధునిక జీవన శైలిలో ఎన్నో రుగ్మతలతో బాధపడుతున్న జనాలకు వీటి గురించి ఎక్కువగా తెలియదు. ఇవి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఎన్నో బాధలకు మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇవి భారత్‌తో పాటు భూటాన్, నేపాల్, ఇండొనేషియా దేశాల్లో కూడా దొరుకుతాయి. కొన్ని వంటకాల్లో మసాలాల్లో, టీలో యాలకులను ఉపయోగిస్తుంటాం. సాధారణంగా మన వంటింట్లో ఉంటాయి.

యాలకుల పంటకు మూడు సంవత్సరాలు:

కాగా, భారతదేశంలో యాలకులు ప్రధానంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సాగు చేస్తారు. యాలకుల సాగు చాలా క్లిష్టంగా ఉంటుంది. యాలకుల పంట సిద్ధం కావడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. ఆ రైతులు సుమారు 10 నుంచి 12 సంవత్సరాల పాటు ఉత్పత్తి చేస్తుంటారు. పంట సాగుకు ఖర్చు ఎక్కువగా ఉండటంతో యాలకుల ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. యాలకులు కిలో ధర రూ.1000 నుంచి రూ.6 వేల వరకు పలుకుతుంది. దీని సగటున కిలోకు రూ.3వేలుగా నిర్ణయిస్తారు. దీనిలో మంచి నాణ్యతతో ఉన్న యాలకులు పొందవచ్చు.

యాలకులతో ఉపయోగాలు:

యాలకుల్లో ఆహారాన్ని జీర్ణం చేసే గుణాలు ఉంటాయి. వీటిలో ఉండే ఔషధ గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిక్ రుగ్మతలను పొగొడుతుంది. యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే పొటాషియం గుండె పని తీరును, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. యాలకుల్లో కావాల్సినంత స్థాయిలో ఎలక్ట్రోలైట్లు కూడా ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

Insurance Policy: మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటున్నారా..? తెలుసుకోవాల్సిన విషయాలు..!

Diabetes: వృద్ధులు ప్రతి రోజు ఆ పని చేస్తే టైప్‌-2 డయాబెటిస్‌ అదుపులో.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు