Digest Food: ఈ ఆహార పదార్థాలను తింటున్నారా..? జీర్ణం కావడానికి దేనికి ఎంత సమయం పడుతుంది..?

Food Digest: ఇప్పుడున్న కాలంలో ఎంతో మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తినే ఆహారం, జీవనశైలి (Lifestyle) తదితర కారణాల..

Digest Food: ఈ ఆహార పదార్థాలను తింటున్నారా..? జీర్ణం కావడానికి దేనికి ఎంత సమయం పడుతుంది..?
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Jan 28, 2022 | 9:56 AM

Food Digest: ఇప్పుడున్న కాలంలో ఎంతో మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తినే ఆహారం, జీవనశైలి (Lifestyle) తదితర కారణాల వల్ల ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అయితే కొన్ని ఆహార నియమాలు (Dietary Rules) పాటిస్తే మన ఆరోగ్యాన్ని(Health) మన చేతుల్లో ఉంచుకోవచ్చు. ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు అనేక రకాల పదార్థాలను తింటారు. ప్రతి ఆహారం వివిధ రకాల రుచిని కలిగి ఉంటాయి. అయితే కొన్ని పదార్థాలు సులభంగా జీర్ణం అవుతాయి.. కొన్ని పదార్థాలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అయితే రాత్రి సమయంలో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. రాత్రి సమయాల్లో త్వరగా జీర్ణం అయ్యే పదార్ధాల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఆహారం జీర్ణం కావడానికి సగటు ఎంత సమయం పడుతుందో చూద్దాం.

డ్రై ఫ్రూట్స్‌: మీరు పొద్దుతిరుగుడు, గుమ్మడికాయ వంటి అధిక కొవ్వు విత్తనాల గురించి తెలిసే ఉంటుంది. ఇవి తింటే కేవలం 60 నిమిషాల్లోనే జీర్ణం అవుతాయి. అలాగే బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు మొదలైనవి జీర్ణం అయ్యేందుకు కొంత సమయం పడతుంది. ప్యాకింగ్‌ చేసిన ఆహార పదార్థాలు: ప్యాకింగ్‌ చేసిన ఆహారపదార్థాలలో ఫ్యాట్‌, సోడియం తదితరాలు ఎక్కువగా ఉండటంతో ఇలా ఉంచిన మాంసం వంటి పదార్థాలు జీర్ణం అయ్యేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది.

ఫ్రూట్‌ షేక్స్‌.. మీరు వేర్వేరు రకాల ఫ్రూట్‌ షేక్స్‌ వంటివి జీర్ణం కావడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అవి 20-30 నిమిషాల్లోనే జీర్ణం అవుతాయి.

కూరగాయలు: కూరగాయలు అనేక రకాలు ఉంటాయి. దోసకాయ, టొమాటో, ముల్లంగి మొదలైన నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు జీర్ణం కావడానికి సమయం తీసుకుంటాయి. ఇవి తిన్న తర్వాత 30-40 నిమిషాలలో జీర్ణం అవుతాయి. మరో వైపు బ్రోకలి, క్యాబేజీ ఇతర వండిన ఆకుకూరలు జీర్ణం కావడానికి 40 నుంచి 50 నిమిషాల సమయం పడుతుంది. ఇవి కాకుండా బత్తాయి, క్యారెట్‌, బిట్‌రూట్‌ జీర్ణం కావడానికి 50-60 నిమిషాల పాటు సమయం పడుతుంది. అలాగే పలాన్‌, మొక్కజొన్న, బంగాళదుంపలు జీర్ణం కావడానికి 60 నిమిషాలు పడుతుంది.

ఇవి కూడా చదవండి:

Diabetes: వృద్ధులు ప్రతి రోజు ఆ పని చేస్తే టైప్‌-2 డయాబెటిస్‌ అదుపులో.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు

Insurance Policy: మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటున్నారా..? తెలుసుకోవాల్సిన విషయాలు..!