AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neocov Variant: కరోనా నియోకోవ్ వేరియంట్ గబ్బిలాల నుంచి వచ్చిందేనా..! శాస్ర్తవేత్తల అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..?

Neocov Variant: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఓమిక్రాన్ వేరియంట్ ముప్పు ఇంకా ముగియలేదు. అప్పుడే మరో కొత్త వేరియంట్ కనుగొన్నారు. దక్షిణాఫ్రికాలో

Neocov Variant: కరోనా నియోకోవ్ వేరియంట్ గబ్బిలాల నుంచి వచ్చిందేనా..! శాస్ర్తవేత్తల అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..?
Corona Virus
uppula Raju
|

Updated on: Jan 29, 2022 | 7:04 AM

Share

Neocov Variant: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఓమిక్రాన్ వేరియంట్ ముప్పు ఇంకా ముగియలేదు. అప్పుడే మరో కొత్త వేరియంట్ కనుగొన్నారు. దక్షిణాఫ్రికాలో కనిపించిన నియో కోవ్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది చాలా ప్రాణాంతకమని చెబుతున్నారు. టైమ్స్ నౌలోని ఒక నివేదిక ప్రకారం.. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో నియోకోవ్ వేరియంట్ కొత్తది కాదని చెప్పారు. ఈ వేరియంట్ SARS కోవ్-2కి సంబంధించినదని తెలిపారు.

దీనిని మొట్టమొదట దక్షిణాఫ్రికాలో గబ్బిలాలలో కనుగొన్నారు. ఈ వేరియెంట్‌ ఇప్పటికీ జంతువులలో వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్ కరోనా వైరస్‌కు సంబంధించినది అయినప్పటికీ ప్రస్తుతం నియోకోవ్ మనుషులకు సోకడం లేదని పరిశోధనలు చెబుతున్నాయి. కాకపోతే ఈ వైరస్‌లో కొత్తగా ఏమైనా మార్పులు జరిగితే అది మానవులకు అత్యంత ప్రాణాంతకంగా మారుతుందని సూచించారు. శాస్త్రవేత్తలు నియోకోవ్‌ని MERS కరోనా వైరస్‌కు సంబంధించినదని నమ్ముతున్నారు.

ఇది మానవులలో జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ సిండ్రోమ్ వరకు వ్యాధులను కలిగిస్తుంది. నివేదిక ప్రకారం ఇప్పటివరకు ఈ పరిశోధనా పత్రాన్ని ఇతర శాస్త్రవేత్తలు సమీక్షించలేదు. ఇది ప్రాథమిక సమాచారం ఆధారంగా మాత్రమే ప్రచురించడం జరిగింది. ఈ వైరస్ మానవులకు వ్యాపిస్తే అది వ్యాక్సిన్ లేదా మునుపటి ఇన్ఫెక్షన్ నుంచి తయారైన యాంటీబాడీలను తప్పించుకోగలదని చెప్పారు. నియోకోవ్ MERS, SARS కోవ్-2కి దగ్గరగా ఉంటుంది.

అందుకే ఇది ప్రస్తుత కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తుంది. మార్స్ కోవ్ నుంచి మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నియోకోవ్ చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయని సూచించారు. కానీ ఈ కొత్త వేరియంట్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఏదైనా కొత్త వేరియంట్ లేదా మ్యుటేషన్ వచ్చినప్పుడల్లా WHO దాని గురించి సమాచారాన్ని అందిస్తుంది.

Viral Photos: ఈ దేశాల వ్యక్తులను పెళ్లి చేసుకుంటే అక్కడి పౌరసత్వం సులువుగా లభిస్తుంది..

Bones Weaken: ఈ 5 ఆహారాలు ఎముకలకు పెద్ద దెబ్బ.. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..

Breakfast: వర్క్‌ ఫ్రం హోం చేసేవారికి ఈ బ్రేక్‌పాస్ట్‌లు సూపర్.. ఫిట్‌నెస్‌తో పాటు మంచి టేస్ట్..?