Inspiring Story: నాడు కరోనా క్రైసిస్ తో ఉద్యోగాలు పోగొట్టుకున్న యువ ఇంజనీర్లు.. టీ స్టాల్ ఓపెన్ చేసి.. నేడు లక్షల్లో సంపాదిస్తున్నారు

Inspiring Story-BTech Chai : రెండేళ్ళ క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ (Corona Virus) సృష్టించిన కల్లోలంలో అనేక మంది  మానసిక, శారీరక ,ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందరో ఉపాధి, ఉద్యోగాలను కోల్పోయారు

Inspiring Story: నాడు కరోనా క్రైసిస్ తో ఉద్యోగాలు పోగొట్టుకున్న యువ ఇంజనీర్లు.. టీ స్టాల్ ఓపెన్ చేసి.. నేడు లక్షల్లో సంపాదిస్తున్నారు
Inspiring Story
Follow us
Surya Kala

|

Updated on: Jan 29, 2022 | 6:52 AM

Inspiring Story-BTech Chai : రెండేళ్ళ క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ (Corona Virus) సృష్టించిన కల్లోలంలో అనేక మంది  మానసిక, శారీరక ,ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందరో ఉపాధి, ఉద్యోగాలను కోల్పోయారు. అయితే ఉన్నత చదువులు చదివి.. మంచి ఉద్యోగం చేస్తూ.. ఉద్యోగం పోగొట్టున్నవారు సరికొత్త పంథాలో పయనిస్తూ.. తమకంటూ ఓ ఉపాధిని కల్పించుకున్నారు. ఈరోజుల్లో టీ కొట్టు పెట్టుకోవడం పెద్ద కష్టం కాదు.. నామ మాత్రం పెట్టుబడి.. కష్టపడే తత్వం ఉంటె చాలు ఎవరైనా చాయ్ బండి(Tea Stall) పెట్టుకోవచ్చు.. తమకంటూ సొంతంగా సంపాదించుకోవచ్చు. అయితే ఒక టీస్టాల్ తో లక్షలు గడించవచ్చని కేరళకు చెందిన ఓ ముగ్గురు ఇంజనీర్లు రుజువు చేశారు. వివరాల్లోకి వెళ్తే..

కరోనా సమయంలో ఏర్పడిన క్రైసిస్ లో కేరళకు చెందిన ఆనంద్ అజయ్, మహమ్మద్ షఫీ, మహమ్మద్ షనావాస్ అనే ముగ్గురు ఇంజనీర్లు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. దీంతో ఉపాధి మార్గాన్ని అన్వేషించారు. టీ స్టాల్ అయితే బాగుంటుందని భావించారు. ముగ్గురు కలిపి మొత్తం రూ.1.5 లక్షల పెట్టుబడితో కొల్లమ్ అనే ప్రాంతంలో “బీటెక్ చాయ్” పేరుతో ఒక టీ స్టాల్ ను ఓపెన్ చేశారు. అయితే తమ టీ స్టాల్ అందరినీ ఆకట్టుకోవాలంటే డిఫరెంట్ గా ఉండాలని భావించారు. దీంతో టీ ప్రియులను ఆకట్టుకొనేలా రకరకాల టీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సామాన్యుల లకు అందుబాటులో ఉండేలా రూ. 5 నుంచి రూ.45 వరకు రకరకాల టీలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

సర్వ సాధారణంగా టీ స్టాల్ వద్ద అల్లం టీ, లెమన్ టీ, బాదాం టీ, హనీ టీ, బ్లాక్ టీ ఇలా కొన్ని రకాలు మాత్రమే దొరుకుతాయి. అయితే ఈ బీటెక్ చాయ్ స్టాల్ లో సుమారు 50 రకాల చాయ్ లను అందిస్తున్నారు. ధర అందుబాటులో ఉండడం.. డిఫరెంట్ టెస్టులతో ఎంతో టేస్టీ గా ఉండటంతో టీ స్టాల్ ప్రారంభించిన కొన్ని రోజులకే బాగా ఫేమస్ అయింది. బీటెక్ చాయ్ బండి దగ్గర పైనాపిల్ చాయ్, స్ట్రాబెర్రీ చాయ్, చాకొలేట్ చాయ్, బాదమ్ పిస్తా చాయ్, వనీలా చాయ్, డెయిరీ మిల్క్ చాయ్, బట్టర్ చాయ్, మింట్ చాయ్, గింజా చాయ్, కుంకుమ పువ్వు చాయ్ చాలా ఫేమస్.

ఈ చాయ్ స్టాల్ లో గింజా చాయ్ వెరీ వెరీ స్పెషల్. ఈ టీని 10 రకాల మసాల దినుసులతో తయారు చేస్తారు. ఈ టీ స్టాల్ తో ఈ యువ ఇంజనీర్లు బాగా లాభాలను ఆర్జిస్తున్నారు. త్వరలో 101 వెరైటీ చాయ్ లను వినియోగ దారులకు అందించేందుకు రెడీ అవుతున్నారు. జీవితంలో ఎదగాలన్నా.. డబ్బు సంపాదించాలన్నా చిన్న ఐడియా, కష్టపడే తత్వం ఉంటె చాలు అని నిరూపించారు ఈ కేరళకు చెందిన యువ ఇంజనీర్లు..

Also Read:

అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఐదు మార్గాలు..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?