కుండీల్లో బెండకాయ చెట్లను ఇలా పెంచితే.. చెట్టు నిండా కాయలే!

Samatha

25  February 2026

కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. వీటితో ఏ రకమైన వంట చేసినా, అద్భుతమైన రుచి ఉంటుంది. అందుకే చాలా మంది బెండకాయ ఫ్రై ఎక్కువ ఇష్టపడతారు.

బెండకాయలు

అంతే కాకుండా బెండకాయ ఆర్యోగానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. అందుకే చాలా మంది బెండకాయను ఎక్కువగా తింటుంటారు.

ఆరోగ్యానికి

ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంటిలోనే కూరగాయలను పెంచుకుంటున్నారు. కుండీలలో  చెట్లు నాటుకొని, కూరగాయలు పండిస్తున్నారు.

కుండీల్లో

అయితే ఇంటిలో కుండీలో నాటిన బెండకాయ చెట్టు, నిండుగా కాయలు కాయాలి అంటే తప్పక కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంట. అవి ఏవో చూద్దాం.

బెండకాయ మొక్కలు

కుండీలో బెండకాయ విత్తనాలు నాటిన తర్వాత అది మొక్కగా ఎదిగి చెట్టు అవుతుంది. దీనికి తప్పకుండా ఎరువులు వేస్తుండాలి.

విత్తనాలు

బెండకాయ చెట్టుకు తప్పకుండా ఏడు నుంచి ఎనిమిది గంటల సూర్యరశ్మి అవసరం. దీని వలన మొక్క వేపుగా పెరిగి, ఎక్కువ కాయలను ఇస్తుంది.

సూర్యరశ్మి

అలాగే ప్రతి రోజూ మొక్కకు నీళ్లు పోయాలి. కానీ పోసిన నీళ్లు ఆ కుండిలో నిల్వ ఉండకుండా చూసుకోవాలి.  నీళ్లు నిల్వ ఉంటే మొక్క త్వరగా పాడైపోతుంది.

నీళ్లు పోయడం

అదే విధంగా కాయలు బాగా రావాలి అంటే, ఆవు పేడ లాంటి సేంద్రియ ఎరువులు వేయాలి. అలాగే ఆకులను కట్ చేస్తూ ఉండటం వలన కాయలు బాగా కాస్తాయి.

సేంద్రియ ఎరువులు