AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breakfast: వర్క్‌ ఫ్రం హోం చేసేవారికి ఈ బ్రేక్‌పాస్ట్‌లు సూపర్.. ఫిట్‌నెస్‌తో పాటు మంచి టేస్ట్..?

Breakfast: కోవిడ్19 కొత్త వేరియేంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరగడంతో ఇటీవల చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను వర్క్‌ ఫ్రం హోం చేయమని చెప్పాయి.

Breakfast: వర్క్‌ ఫ్రం హోం చేసేవారికి ఈ బ్రేక్‌పాస్ట్‌లు సూపర్.. ఫిట్‌నెస్‌తో పాటు మంచి టేస్ట్..?
Breakfast
uppula Raju
|

Updated on: Jan 28, 2022 | 2:44 PM

Share

Breakfast: కోవిడ్19 కొత్త వేరియేంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరగడంతో ఇటీవల చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను వర్క్‌ ఫ్రం హోం చేయమని చెప్పాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో చాలా రకాల ఆహరాలు తింటుంటాం. దీనివల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రొటీన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అంతేకాదు ఒకే దగ్గర గంటల తరబడి కూర్చోకుండా గంట గంటకి ఐదు నిమిషాలు వాకింగ్ చేస్తే మంచిది. వర్క్‌ ఫ్రం హోం చేసేవారికి ఈ బ్రేక్‌ఫాస్ట్‌లు సూపర్‌గా సెట్‌ అవుతాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. సలాడ్స్‌

శీతాకాలంలో ఆకు కూరలను ఎక్కువగా వాడాలి. దీని కోసం 4-6 బచ్చలికూర ఆకులు, 1 అరటి, 1/2 ఉసిరి, 1 క్యారెట్, 2 టేబుల్ స్పూన్ల చియా గింజలను కలపండి. దానికి ఉప్పు, మిరియాలు, 1/2 స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగాలి. ఇలా చేస్తే చాలా రోజు మొత్తం చాలా యాక్టివ్‌గా ఉంటారు.

2. పండ్ల ముక్కలు

ప్రపంచంలోని అత్యంత బెస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ ఫ్రూట్స్‌. ఇందుకోసం సీజనల్ పండ్లను ఎంచుకోవాలి. వాటిని ఒక గిన్నెలో కట్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, నిమ్మరసం వేసి తింటే సరిపోతుంది.

3. ఓట్స్

ఓట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. దీని కోసం ఒక గిన్నెలో 1/2 కప్పు ఓట్స్, దీనికి వేడి లేదా చల్లని పాలు కలపాలి. కొన్ని తరిగిన పండ్లను అందులో వేసి తినండి. ఈ చిరుతిండి రుచిని పెంచడానికి అందులో కొద్దిగా తేనె కలుపుకోవచ్చు.

4. అరటి షేక్

ఇది మరొక ప్రసిద్ధ అల్పాహారం ఎంపిక. దీని కోసం 2 అరటిపండ్లు, 1 కప్పు పాలు, 4 తరిగిన బాదంపప్పులు, 2 వాల్‌నట్‌లు, 2 టేబుల్ స్పూన్ల తేనె, 2 టేబుల్ స్పూన్ల మిశ్రమ విత్తనాలను బ్లెండ్ చేసి ఆనందంగా తినండి. ఇది చాలా లైట్‌ఫుడ్‌. బరువు కచ్చితంగా అదుపులో ఉంటుంది.

Heart: ఆరోగ్యమైన గుండె కోసం ఐదు సూత్రాలు.. దీర్ఘాయుష్షు పొందాలంటే ఇవి చాలు..?

Mahindra: చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ త్రీ వీలర్.. ధర ఎంతంటే..?

IPL 2022 వేదిక ముంబై.. ఈ 3 గ్రౌండ్‌లలో మ్యాచ్‌లు..! ఫిబ్రవరి 20న అధికారిక ప్రకటన..