AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart: ఆరోగ్యమైన గుండె కోసం ఐదు సూత్రాలు.. దీర్ఘాయుష్షు పొందాలంటే ఇవి చాలు..?

Heart: శరీరంలోని ప్రధాన అవయవాలలో గుండె ఒకటి. ఇది ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలోని జీవక్రియలన్ని సక్రమంగా జరుగుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే

Heart: ఆరోగ్యమైన గుండె కోసం ఐదు సూత్రాలు.. దీర్ఘాయుష్షు పొందాలంటే ఇవి చాలు..?
uppula Raju
|

Updated on: Jan 28, 2022 | 2:47 PM

Share

Heart: శరీరంలోని ప్రధాన అవయవాలలో గుండె ఒకటి. ఇది ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలోని జీవక్రియలన్ని సక్రమంగా జరుగుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే గుండె జబ్బులను నివారించవచ్చు. ప్రస్తుత కొవిడ్‌ సమయంలో గుండె సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా హార్ట్‌ ఎటాక్‌తో తొమ్మిది మిలియన్లకు పైగా జనాలు చనిపోతున్నారు. WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాలలో 16 శాతానికి గుండెపోటే కారణం. ఈ మరణాలలో ఆరు మిలియన్లకు పైగా 30 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే. అత్యధిక సంఘటనలు చైనాలో సంభవించాయి భారతదేశం, రష్యా, యుఎస్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఆరోగ్యవంతమైన గుండె కోసం 5 సూత్రాలు పాటిస్తే చాలు.

1. మానసిక ఆరోగ్యంపై అప్రమత్తత: ప్రతి ఒక్కరు మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే రకరకాల రుగ్మతల బారిన పడుతారు. దీనివల్ల గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. మీకు మనసు బాగా లేనప్పుడు నచ్చిన ప్రదేశాలకు వెళ్లండి. విటమిన్లు, పోషకాలను కోల్పోకుండా వైద్యుడిని సంప్రదించండి. ప్రతిరోజు యోగా, ధ్యానం, చేయండి

2. ఆహారంలో ఉప్పు నియంత్రణ: ఆరోగ్యకరమైన గుండె కోసం మీరు సాధారణ బీపీని కలిగి ఉండాలి. ఉప్పులో సోడియం ఉంటుంది ఇది మీ రక్తపోటును సాధారణం కంటే పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ మీరు అదనపు ఉప్పును తీసుకోకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఊరగాయలు, పాపడ్‌లు, ప్రిజర్వ్‌లు, చిప్స్, పిజ్జాలు, చీజ్, పాశ్చరైజ్డ్ బటర్ మొదలైన వాటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. వీటిని తినడం మానుకోవాలి. ఇది మూత్రపిండాలకు కూడా హాని కలిగిస్తుంది.

3. మంచి నిద్ర: అసంపూర్ణ మైన నిద్ర మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మీ పని ఉత్పాదకతను, అర్థం చేసుకునే తత్వాన్ని, మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చాలా రోజులు ఇలాగే జరిగితే గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట నిద్ర పట్టకపోతే పాలు తాగడం లాంటి హోమ్‌ రెమిడీస్ పాటించాలి. టీ, కాఫీలను తీసుకోకూడదు.

4. గుండెకి మేలు చేసే ఆహారం: 30 ఏళ్ల హార్వర్డ్ అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజు 2 పండ్లు, 3 కూరగాయలను డైట్‌ లో చేర్చుకుంటే ఎక్కువ కాలం జీవించవచ్చు. ఎందుకంటే ఈ ఆహారం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శాఖాహారం ఆరోగ్యానికి ఎల్లప్పుడు మంచిది. ఇందులో గుండెకి అవసరమయ్యే అన్ని పోషకాలు లభిస్తాయి. మాంసాహారంలో కొన్ని మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా ఇవి గుండెపై ఒత్తిడి పెంచుతాయి.

5. యాక్టివ్‌గా ఉండండి: మనిషి యాక్టివ్‌గా ఉన్నప్పుడు శరీరంలో అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం కచ్చితంగా చేయాలి. రోజు 10,000 అడుగులు నడవాలి. వారానికి మూడు నుంచి ఐదు సార్లు కనీసం 30 నిమిషాల మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయాలి. ప్రతి గంటకు ఐదు నిమిషాల నడక తప్పనిసరి. ఒకేచోట ఎప్పుడు కూర్చొని పనిచేయకూడదు. ఇది గుండెజబ్బులకి కారణం అవుతుంది.

Mahindra: చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ త్రీ వీలర్.. ధర ఎంతంటే..?

IPL 2022 వేదిక ముంబై.. ఈ 3 గ్రౌండ్‌లలో మ్యాచ్‌లు..! ఫిబ్రవరి 20న అధికారిక ప్రకటన..

Lok Sabha: వామ్మో ఆ సీటు అస్సలే వద్దు.. లోక్‌సభలో జడుసుకున్న ఎంపీలు..?

భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో