Lok Sabha: వామ్మో ఆ సీటు అస్సలే వద్దు.. లోక్‌సభలో జడుసుకున్న ఎంపీలు..?

Lok Sabha:మన దేశంలో శుభం, అశుభాల గురించి ఆలోచించే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. అంకెలకు, సంఖ్యలకు ప్రాధాన్యత ఇచ్చేవారు కూడా ఉన్నారు.

Lok Sabha: వామ్మో ఆ సీటు అస్సలే వద్దు.. లోక్‌సభలో జడుసుకున్న ఎంపీలు..?
Loksabha
Follow us
uppula Raju

|

Updated on: Jan 28, 2022 | 1:01 PM

Lok Sabha:మన దేశంలో శుభం, అశుభాల గురించి ఆలోచించే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. అంకెలకు, సంఖ్యలకు ప్రాధాన్యత ఇచ్చేవారు కూడా ఉన్నారు. ఏదైనా శుభ కార్యానికి తేదీని చూస్తారు. దీని కోసం సంఖ్యలు లెక్కిస్తారు. ప్రతి ఒక్కరికి అదృష్ట సంఖ్య ఉంటుంది నిత్యం దానికోసం పాకులాడుతారు. అయితే సంఖ్యలను నమ్మని వ్యక్తులు కూడా దేశంలో చాలామంది ఉన్నారు. అయితే దేశ పార్లమెంట్‌లో 420 నెంబర్ గురించి గొడవ జరిగింది. ఏ ఎంపీ అయినా ఆ సీట్‌ వద్దంటే వద్దన్నారు. కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

‘420’ వెనుక మ్యాటర్ ఏంటి?

దేశంలోని పార్లమెంట్‌లో సీటు నంబర్ ‘420’కి చోటు దక్కలేదు. 14వ లోక్‌సభ నుంచే ఈ నంబర్‌ను ఏ ఎంపీకి కేటాయించడం లేదు. వాస్తవానికి భారతీయ శిక్షాస్మృతిలోని ‘సెక్షన్ 420’ ప్రకారం ఫోర్జరీ, మోసానికి పాల్పడే వ్యక్తులపై కేసు నమోదు చేస్తారు. అందుకే ఈ సంఖ్యను మన దేశంలో మోసానికి చిహ్నంగా భావిస్తున్నారు. ప్రజలు మోసగాళ్లని ‘420’ నెంబర్‌తో పిలవడం కూడా ఒక కారణం. దీంతో లోక్‌సభలో ఏ ఎంపీ అయినా ఈ సీటు వద్దంటే వద్దంటున్నారు.

14వ లోక్‌సభ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎంపీలకు సీట్ల సంఖ్యను కేటాయించారు. ఈ సమయంలో ఒక ఎంపీకి 420 నంబర్ సీటు కేటాయించారు. ఆ సభ్యుడు తనను అవమానించినట్లుగా భావించి, దానిని రద్దు చేయాలని స్పీకర్‌ను కోరారు. సభ్యుని అభ్యంతరం తర్వాత లోక్‌సభ సీటు నంబర్ 420ని రద్దు చేసి, దాని స్థానంలో కుర్చీ నంబర్ 419-ఎతో భర్తీ చేశారు.

ఎంపీల సిట్టింగ్ స్థానాలను ఎవరు నిర్ణయిస్తారు?

లోక్‌సభలో ఏ సభ్యుడు కూర్చోవాలో నిర్ణయించే హక్కు లోక్‌సభ స్పీకర్‌కు ఉంటుంది. లోక్‌సభ స్థానాలు 6 బ్లాక్‌లుగా విభజిస్తారు. ప్రతి బ్లాక్‌లో 11 వరుసలు ఉంటాయి.15వ లోక్‌సభలో సీట్ల కేటాయింపు సందర్భంగా అస్సాం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్‌కు 420వ నంబర్‌కు 419-A సీటును కేటాయించారు. భారత రాజ్యాంగం ప్రకారం సభలో గరిష్టంగా 552 మంది సభ్యులు ఉండాలనే నిబంధన ఉన్న విషయం తెలిసిందే.

SSC JE Result 2019: SSC జూనియర్ ఇంజనీర్ ఫలితాలు విడుదల.. ఇలా తనిఖీ చేసుకోండి..?

చలికాలం ఓక్యులర్ మైగ్రేన్‌తో జాగ్రత్త.. వ్యాధి లక్షణాలు, కారణాలు తెలుసుకోండి..?

NMMSS 2022: ఏడో తరగతి విద్యార్థులకు ఏటా రూ.12000.. చివరి తేదీ జనవరి 30..?