NMMSS 2022: ఏడో తరగతి విద్యార్థులకు ఏటా రూ.12000.. చివరి తేదీ జనవరి 30..?
NMMSS 2022: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMSS 2022) కోసం దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.
NMMSS 2022: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMSS 2022) కోసం దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ దగ్గరపడింది. ముందుగా ఈ స్కాలర్‌షిప్ కోసం చివరితేదీ 22 జనవరి 2022 నిర్ణయించారు. అయితే చాలామంది అప్లై చేసుకోలేదని వాదనలు వినిపిస్తే చివరి తేదీ జనవరి 30 వరకు పొడగించారు. ఈ స్కాలర్‌షిప్ కోసం 55 శాతం మార్కులతో VII తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులు. మీరు అధికారిక వెబ్‌సైట్ dsel.education.gov.inని సందర్శించడం ద్వారా ఈ స్కాలర్‌షిప్ వివరాలను తెలుసుకోవచ్చు.
నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ (NMMSS) కోసం ఎంపిక పరీక్ష కోసం షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎంపిక పరీక్ష ద్వారా 8వ తరగతి చదువుతున్న విద్యార్థికి ఏటా 12 వేల రూపాయల స్కాలర్ షిప్ అందజేస్తారు. నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ కోసం ఎంపిక పరీక్ష ఈసారి 18 ఫిబ్రవరి 2022న నిర్వహిస్తున్నారు. NMMSS పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థికి 12వ తరగతి వరకు సంవత్సరానికి 12,000 రూపాయల సాధారణ స్కాలర్‌షిప్ అందిస్తారు.
NMMSS స్కాలర్‌షిప్ అంటే ఏమిటి?
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పథకం అనేది కేంద్ర ప్రభుత్వంచే స్పాన్సర్ చేయబడిన పథకం. ఇది 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థుల డ్రాప్ అవుట్‌లను నిరోధించే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అర్హులైన విద్యార్థులు రూ.12000 పొందుతారు. స్కాలర్‌షిప్ మొత్తం సంవత్సరానికి చొప్పున అందుబాటులో ఉంటుంది.
పరీక్ష వివరాలు
NMMSS పరీక్షను రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. మొదటి షిఫ్టులో మెంటల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, రెండో షిఫ్ట్ ఎడ్యుకేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. మొదటి షిప్టు 10.30 నుంచి 12 గంటల వరకు, రెండోది మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఉంటుంది. రెండు షిఫ్ట్‌లలో 90 మార్కులకు 90 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి.
NMMSS స్కాలర్‌షిప్ పథకం కోసం భారత ప్రభుత్వం ద్వారా ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ఇవ్వలేదు. కానీ వారు సాధారణ వర్గంలో గుర్తించబడుతారు. NMMS పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులు 9వ తరగతి అడ్మిషన్ తీసుకున్న తర్వాత నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అదేవిధంగా 10,11, 12వ తరగతిలో రెన్యూవల్ చేసుకోవాలని NMMS ఇన్‌ఛార్జ్ తెలిపారు.