చలికాలంలో క్యారెట్ చట్నీ సూపర్.. ఆరోగ్యంతో పాటు అదిరే టేస్ట్‌..ఇంట్లోనే తయారుచేయండి..?

చలికాలంలో క్యారెట్ చట్నీ సూపర్.. ఆరోగ్యంతో పాటు అదిరే టేస్ట్‌..ఇంట్లోనే తయారుచేయండి..?
Carrot Pickle Recipe

Carrot Pickle: పచ్చళ్లు ఆహారం రుచిని మరింత పెంచుతాయి. శీతాకాలంలో మీరు అనేక రకాల ఊరగాయలను ఆస్వాదించవచ్చు. ఇందులో క్యారెట్ ఊరగాయ

uppula Raju

|

Jan 28, 2022 | 7:49 AM

Carrot Pickle: పచ్చళ్లు ఆహారం రుచిని మరింత పెంచుతాయి. శీతాకాలంలో మీరు అనేక రకాల ఊరగాయలను ఆస్వాదించవచ్చు. ఇందులో క్యారెట్ ఊరగాయ కూడా ఒకటి. క్యారెట్ ఊరగాయ తయారు చేయడం చాలా సులభం. ఇది ఉప్పు, పులుపు, తీపి రుచితో నిండి ఉంటుంది. మీరు క్యారెట్ ఊరగాయను చపాతీలు, పరాఠాలు మొదలైన వాటితో తినవచ్చు. మీకు ఇష్టమైతే క్యారెట్‌ చట్నీని ఇంట్లోనే తయారుచేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

క్యారెట్ చట్నీకి కావలసిన పదార్థాలు..

300 గ్రాముల తరిగిన క్యారెట్లు, 1/2 స్పూన్ నల్ల ఆవాలు, ఉప్పు తగినంత,1/2 స్పూన్ పసుపు, 1 చిటికెడు ఇంగువ, 3 టేబుల్ స్పూన్లు ఆవాల నూనె, 1/2 స్పూన్ ఎర్ర మిరపకాయ, 1 tsp ఎండిన మామిడి పొడి, 1 స్పూన్ ఫెన్నెల్ గింజలు

క్యారెట్‌ చట్నీ తయారీ విధానం..

క్యారెట్‌లను పెద్ద గిన్నెలో వేసి నీటితో బాగా కడగాలి. తర్వాత కిచెన్ టవల్ సహాయంతో పూర్తిగా ఆరబెట్టాలి. ఇప్పుడు క్యారెట్‌ను చిన్న వేలు పరిమాణంలో పొడవాటి మందపాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కల గిన్నెలో నల్ల ఆవాలు వేసి బాగా కలపాలి. దానికి ఎర్ర మిరపకాయ, ఉప్పు, యాలకుల పొడి, పసుపు, ఇంగువ వేయాలి. ఈ గిన్నెలో ఆవాల నూనె వేయాలి. అన్ని పదార్థాలను బాగా కలపాలి. పొడిగా ఉందని మీకు అనిపించినప్పుడు మాత్రమే కొద్దిగా నూనె వేయాలి. అంతే క్యారెట్‌ చట్నీ సిద్దం. గాలి చొరబడని డబ్బాలో ఈ చట్నీని వేసి నిల్వ చేసుకోండి.

చలికాలంలో పచ్చళ్లు తింటే మంచిదే

చలికాలంలో స్వల్పకాలిక పచ్చళ్లు తింటే మంచిదే. కానీ ధీర్ఘకాలిక పచ్చళ్లు తినకూడదు. ఈ పచ్చ్లళ్లు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి మీ శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతాయి. ఊరగాయల తయారీకి రకరకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారు. ఇందులో మెంతులు, ఆవాలు మొదలైనవి ఉంటాయి. ఈ మసాలా దినుసుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.

Beer Making: పది లీటర్ల బీర్ తయారీకి ధాన్యం ఎంత కావాలి.. వ్యర్థాల పరిస్థితి ఏంటి..?

Cabbage: క్యాబేజీలో పాలలో ఉన్నంత కాల్షియం.. ఈ 5 సమస్యలకు చక్కటి నివారణ..

చలికాలం చేతులు, కాలి వేళ్లపై ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఆ వ్యాధి కావొచ్చు..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu