చలికాలం చేతులు, కాలి వేళ్లపై ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఆ వ్యాధి కావొచ్చు..!

చలికాలం చేతులు, కాలి వేళ్లపై ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఆ వ్యాధి కావొచ్చు..!
Chilblains

Chilblains: ప్రస్తుతం చలి విధ్వంసం కొనసాగుతోంది. చలికాలంలో జలుబు, దగ్గు మాత్రమే కాదు కొన్ని కొత్త వ్యాధులు కూడా ఏర్పడుతాయి.

uppula Raju

|

Jan 27, 2022 | 2:14 PM

Chilblains: ప్రస్తుతం చలి విధ్వంసం కొనసాగుతోంది. చలికాలంలో జలుబు, దగ్గు మాత్రమే కాదు కొన్ని కొత్త వ్యాధులు కూడా ఏర్పడుతాయి. వీటికి తక్షణ చికిత్స అవసరం లేదంటే వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. చలికాలంలో తరచుగా చిల్ బ్లెయిన్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఏంటి.. దీని లక్షణాలు ఎలా ఉంటాయి.. దీనిని ఎలా నివారించాలి తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

చిల్ బ్లెయిన్ అంటే ఏమిటి?

నిజానికి శీతాకాలంలో చల్లని గాలికి గురికావడం వల్ల చేతులు, కాళ్ళలో వాపులు, శరీరంలోని చిన్న రక్త నాళాలు చిట్లడం జరుగుతుంది. దీనినే చిల్ బ్లెయిన్ అంటారు. దీని కారణంగా వేళ్లు, కాలి అనేక సందర్భాల్లో చెవి దిగువ భాగం ఎర్రగా మారి వాపులు ఏర్పడుతాయి. నడవలేని పరిస్థితులు ఏర్పడుతాయి.

ఎలా తెలుసుకోవాలి?

చేతులు, కాలి, బుగ్గలపై అకస్మాత్తుగా తీవ్రమైన దురద, వెచ్చదనం లేదా మంటగా ఉంటే చిల్‌ బ్లెయిన్‌ వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి. సున్నితమైన చర్మంపై తీవ్రమైన చలి తర్వాత వేడి కారణంగా ఎక్కువగా ఈ రకమైన సమస్య ఏర్పడుతుంది. ఇలా జరిగినప్పుడు గోళ్లతో గోకడం కాకుండా క్లాత్‌తో రుద్దాలి. అలాగే కొంతమంది వేడితో కాపడం లాంటివి చేస్తారు ఇలా చేయకూడదు. సమస్య తీవ్రమవుతుంది.

ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు చేతులకు గ్లౌజులు, పాదాలకు సాక్స్ ధరించాలి. మహిళలు ఇంట్లో సాక్స్ ధరించడంతోపాటు క్లాత్ షూస్ ఉపయోగించాలి. చల్లని నీటికి చేతులు, కాళ్ళను దూరంగా ఉంచాలి. వీలైనంత వరకు చలికి దూరంగా ఉండాలి. అవసరమైనప్పుడు మాత్రమే ఇంటి నుంచి బయటికి వెళ్లాలి. దీని నుంచి ఉపశమనం కోసం వేడి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి చేతులు, కాళ్ళను నానబెట్టాలి. మరింత సమస్య ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

Vastu Tips: వాస్తు ప్రకారం ఈ 5 పనులు చేస్తే అదృష్టం మీ వెంటే.. అవేంటంటే..?

వారు నిత్య యవ్వన వంతులు.. 60 ఏళ్ల వయస్సులో 40 ఏళ్లుగా కనిపిస్తారు..!

IND vs WI: భారత పర్యటనకు జట్టుని ప్రకటించిన వెస్టిండీస్.. రెండున్నరేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన కీలక ఆటగాడు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu