వారు నిత్య యవ్వన వంతులు.. 60 ఏళ్ల వయస్సులో 40 ఏళ్లుగా కనిపిస్తారు..!
Hunza People: మంచి ఆహారం తీసుకొని సంతోషంగా ఉంటే ఎక్కువ జీవిత కాలం ఉంటుందని అందరికి తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో
Hunza People: మంచి ఆహారం తీసుకొని సంతోషంగా ఉంటే ఎక్కువ జీవిత కాలం ఉంటుందని అందరికి తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అది ఎవ్వరికీ సాధ్యం కాదు. కానీ పాకిస్తాన్‌లోని ఒక ప్రదేశంలో జీవించే ప్రజలు దీనిని చేసి చూపిస్తున్నారు. వారు 60 ఏళ్ల వయసులో కూడా 30 నుంచి 40 ఏళ్లుగా కనిపిస్తారు. సుమారు 100 నుంచి 120 ఏళ్లు బతుకుతారు. ఇక్కడి మహిళలు 60 ఏళ్ల వయసులో కూడా పిల్లలు కనడానికి సిద్దంగా ఉంటారు. ఇది కేవలం వారి అలవాట్ల వల్ల మాత్రమే జరుగుతుంది. ఆ ప్రదేశం, ఆ ప్రజల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఈ ప్రదేశం మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఉంది. హిమాలయాల ఒడిలో హుంజా వ్యాలీ అనే ప్రాంతంలో ఈ ప్రజలు నివసిస్తున్నారు. ఈ ఏరియా పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఉంది. ఇక్కడి ప్రజలని బురుషో ప్రజలు అంటారు. ఈ ప్రాంతంలో పర్వతాలు మాత్రమే ఉంటాయి. ఈ కొండ ప్రాంతంలో నివసించే బురుషో ప్రజలు ప్రత్యేక గుర్తింపును సాధించారు. ఈ ప్రాంతం ప్రజల ఆరోగ్యంతో పాటు సహజ సౌందర్యం, చరిత్ర, అక్షరాస్యత, పండ్లు మొదలైన వాటికి ప్రసిద్ధి చెందింది.
ఇక్కడి ప్రజలు ఎందుకు ప్రసిద్ధి చెందారు?
సోషల్ మీడియా నుంచి అనేక వార్తా నివేదికల ప్రకారం.. ఇక్కడ ప్రజలు 120 సంవత్సరాలకు పైగా జీవిస్తారని చాలా ఆరోగ్యంగా ఉంటారని నివేదించారు. ఇక్కడి 60 ఏళ్ల వృద్ధ మహిళలు నగరాల్లోని 40 ఏళ్ల వయస్సు గల స్త్రీల వలె యవ్వనంగా, చురుకుగా కనిపిస్తారు. ఇక్కడి నివసించే ప్రజలకు వృద్ధాప్యం చాలా ఆలస్యంగా వస్తుంది. ఈ ప్రాంత ప్రజలకు కేన్సర్ ఇప్పటి వరకు రాలేదు. మహిళలు 65 ఏళ్ల వరకు పిల్లలను కనవచ్చని వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కాకుండా ఇక్కడ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఇతర వాదనలు కూడా ఉన్నాయి.
ఇక్కడి ప్రజలు యవ్వనంగా ఎందుకు ఉంటారు..?
ఈ ప్రదేశంలో ఏదైనా అద్భుతం ఉందా లేదా మరేదైనా కారణాల వల్ల ఇది జరిగిందా అనేది ప్రశ్న. కానీ ఇది అద్భుతం కాదు ఇక్కడి జీవనశైలి దీనికి ముఖ్యమైన కారణం. నివేదికల ప్రకారం.. వారి డైట్ చార్ట్‌లో పోషకాహారం మాత్రమే ఉంటుంది. హుంజా ప్రజలు తమ ఆహారంలో ఎండలో ఎండబెట్టిన వాల్‌నట్‌లు, ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా తింటారని పరిశోధకులు తెలిపారు. ఇది కాకుండా ఈ వ్యక్తులు రోజువారీ ఆహారంలో ముడి కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, గింజలు, పాలు, గుడ్లు, జున్ను వాడుతారు. పురుగుమందులు పిచికారీ చేయడం ఈ సంఘంలో నిషేధం. మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల ఇక్కడి ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారు. ఇదే వారు ఎక్కువకాలం బతకడానికి కారణం.