IND vs WI: భారత పర్యటనకు జట్టుని ప్రకటించిన వెస్టిండీస్.. రెండున్నరేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన కీలక ఆటగాడు..

IND vs WI: ఫిబ్రవరిలో భారత పర్యటనకు వచ్చే వెస్టిండీస్ వన్డే జట్టుని ప్రకటించింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత కెమర్ రోచ్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు.

IND vs WI: భారత పర్యటనకు జట్టుని ప్రకటించిన వెస్టిండీస్.. రెండున్నరేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన కీలక ఆటగాడు..
West Indies Vs England
Follow us
uppula Raju

|

Updated on: Jan 27, 2022 | 11:00 AM

IND vs WI: ఫిబ్రవరిలో భారత పర్యటనకు వచ్చే వెస్టిండీస్ వన్డే జట్టుని ప్రకటించింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత కెమర్ రోచ్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. ఐర్లాండ్‌పై వెస్టిండీస్ 1-2 తేడాతో ఓడిపోయింది. భారత పర్యటనలో వెస్టిండీస్ ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 11 వరకు మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. అదే సమయంలో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ కూడా ఆడాల్సి ఉంటుంది. రోచ్ తన చివరి వన్డేను 2019లో భారత్‌తో ఆడాడు. అప్పటి నుంచి అతను వైట్ బాల్ క్రికెట్ లేదా లిస్ట్ A, T20 మ్యాచ్‌లు ఆడలేదు. జట్టును ఎంపిక చేసిన చీఫ్ సెలెక్టర్ రెస్మండ్ హేన్స్.. రోచ్ అనుభవజ్ఞుడు ఆరంభంలో వికెట్లు తీయడంలో కీలకపాత్ర పోషించగలడు కాబట్టి అతనికి జట్టులో అవకాశం కల్పించినట్లు చెప్పారు.

బ్యాటింగ్‌ను బలోపేతం

ఫ్యాబియన్ అలెన్ కోవిడ్ 19 నుంచి కోలుకున్నాడు, గుడ్కేష్.. మోతీ స్థానంలో జట్టులోకి వచ్చాడు. న్క్రుమా బోన్నర్, డారెన్ బ్రావో, బ్యాండ్‌జెన్ రాకతో జట్టు బ్యాటింగ్ పటిష్టం కాగా హేడెన్ వాల్ష్ ఆల్‌రౌండర్‌గా ఎంపికయ్యాడు. ఇటీవల జట్టు ఐర్లాండ్‌తో పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది ఆ తర్వాత జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ బలహీనంగా ఉందని పేర్కొన్నాడు. ఈ కారణంగానే భారత పర్యటనలో జట్టు బ్యాటింగ్‌ను పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

డెస్మండ్ తొలిసారిగా జట్టును ఎంపిక చేశాడు

భారత పర్యటన కోసం వన్డే జట్టును కొత్త సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ ఎంపిక చేశాడు. ఇటీవలే రోజర్ హార్పర్ స్థానంలో హేన్స్ వచ్చాడు. ఐర్లాండ్‌తో జరిగిన ఘోర పరాజయం తర్వాత జట్టులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచకప్‌కి సన్నద్ధం కావడానికి ఈ జట్టును ఎంచుకున్నానని ఈ సిరీస్‌ చాలా ముఖ్యమైనదని హేన్స్ అభిప్రాయపడ్డాడు.

జట్టు ఎంపిక గురించి డెస్మండ్ మాట్లాడుతూ ‘మాకు ప్రతిచోటా పోటీ కావాలి. ఒకే స్థానం కోసం చాలా మంది ఆటగాళ్ళు పోటీపడే ప్రదేశానికి మేము చేరుకోవాలని కోరుకుంటున్నాము. మేము ప్లేయర్‌లను ఎంచుకోగల పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను సృష్టించాలి. ఎంచుకున్న జట్టు అద్భుతంగా ఉంది ప్రపంచ కప్‌కు సిద్ధం కావడానికి ఈ పర్యటన చాలా ముఖ్యమైంది.

వెస్టిండీస్ జట్టు : కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, న్క్రుమా బోన్నర్, డారెన్ బ్రేవో, షమ్రా బ్రూక్స్, జాసన్ హోల్డర్, షే హోప్, అకిల్ హుస్సేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, కెమర్ రోచ్, రొమారియా స్మిత్, ఒడియోన్ షెపర్డ్, వాల్ష్ జూనియర్

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గమనిక.. UAN పాస్‌వర్డ్ మర్చిపోయారా.. ఇలా చేయండి..?

చాణక్య నీతి: జీవితంలో ఈ 3 పనులు ఆలస్యం చేయవద్దు.. లేదంటే మరణించే సమయంలో పశ్చాత్తాపం..?

Xiaomi Redmi Note 11 సిరీస్‌లో 4 కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్లు తెలుసుకోండి..?