Telugu News » Photo gallery » Cricket photos » India vs west indies: Team India Selectors key chance to Deepak Hooda Ravi Bishnoi Avesh Khan Kuldeep Yadav Axar Patel for west indies seires
IND VS WI: ఈ ఐదుగురికి గోల్డెన్ ఛాన్స్.. వెస్టిండీస్‌తో సత్తా చాటితే ఇక తిరుగుండదన్న మాజీలు..!
India vs west indies: వన్డే, టీ20 సిరీస్‌ల కోసం టీమిండియాను ప్రకటించారు. అయితే స్వ్కాడ్‌లోకి ఎంపికైన ఈ ఐదుగురి ఆటగాళ్లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
India Vs West Indies: వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌నెస్‌తో పునరాగమనం చేస్తున్నాడు. ప్ర్తుతం అతను పూర్తి సమయం కెప్టెన్‌గా మొదటి వన్డే, టీ20 సిరీస్‌లు ఆడబోతున్నాడు. అదే సమయంలో, సెలెక్టర్లు కొంతమంది యువ ఆటగాళ్లపై విశ్వాసం వ్యక్తం చేశారు. వారి స్థిరమైన ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. టీమ్ ఇండియాలోకి ఎంపికైన ఈ ఐదుగురి ఆటగాళ్లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1 / 6
రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ దీపక్ హుడా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గత సంవత్సరం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 73 కంటే ఎక్కువ సగటుతో 293 పరుగులు చేశాడు. అయితే విజయ్ హజారే ట్రోఫీలో, బ్యాట్స్‌మన్ 33 సగటుతో 198 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయినప్పటికీ, సెలెక్టర్లు హుడాపై విశ్వాసం ఉంచారు.
2 / 6
రాజస్థాన్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తొలిసారిగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ యువ స్పిన్నర్‌కు వన్డే, టీ20 రెండు జట్లలోనూ చోటు దక్కింది. బిష్ణోయ్ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు పడగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బిష్ణోయ్ 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. విజయ్ హజారేలో కూడా, ఈ బౌలర్ 6 మ్యాచ్‌లలో 8 మంది వికెట్లను పడగొట్టాడు.
3 / 6
మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్‌కి కూడా టీమిండియాలో అవకాశం దక్కింది. అవేష్ ఖాన్ గత కొంతకాలంగా టీమ్ ఇండియా సెటప్‌లో భాగమయ్యాడు. అతను నెట్ బౌలర్‌గా భారత జట్టుతో కలిసి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. అవేశ్ ఖాన్ ఈసారి వన్డే, టీ20 రెండింటిలోనూ చోటు దక్కించుకున్నాడు. 145 కి.మీ. గంతో బంతిని విసిరే ఈ బౌలర్.. టీమ్ ఇండియాకు ట్రంప్ కార్డ్ అని నిరూపించుకునే ఛాన్స్ ఉంది.
4 / 6
కుల్దీప్ యాదవ్ కూడా వన్డే, టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు. చైనామాన్ బౌలర్ గత ఏడాది మోకాలి గాయంతో బాధపడ్డాడు. అంతకు ముందు అతను టీమ్ ఇండియాకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే సెలెక్టర్లు మరోసారి కుల్దీప్‌కు అవకాశం ఇచ్చారు. కుల్దీప్ 65 వన్డేల్లో 107 వికెట్లు తీశాడు. టీ20లోనూ కుల్దీప్ 23 మ్యాచుల్లో 41 వికెట్లు తీశాడు.
5 / 6
ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా గాయం తర్వాత పునరాగమనం చేశాడు. ఈ ఆటగాడికి టీ20 జట్టులో చోటు దక్కింది. అక్షర్‌కు వన్డే జట్టులో అవకాశం రాలేదు. భారత్ తరఫున 15 టీ20ల్లో అక్షర్ 13 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా గైర్హాజరీలో అక్షర్‌కు తానేంటో నిరూపించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు.