IND vs WI: రవి బిష్ణోయ్ ఎంట్రీ నుంచి అశ్విన్‌పై వేటు వరకు.. టీమిండియా స్వ్కాడ్‌లో 5 భారీ మార్పులు

Team India: ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌తో అహ్మదాబాద్, కోల్‌కతాలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడాల్సి ఉంది.

Venkata Chari

|

Updated on: Jan 27, 2022 | 7:04 AM

వెస్టిండీస్‌తో తలపడే భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఎంపికైంది. రెండు సిరీస్‌లకు ఎంపికైన జట్లలో అనేక షాకింగ్ నిర్ణయాలు ఉన్నాయి. చాలా పాత ముఖాలు తిరిగి వచ్చాయి. కొన్ని కొత్త ముఖాలు కూడా వచ్చాయి. అలాగే కొందరు సీనియర్ ఆటగాళ్లకు కూడా దారి చూపించారు. మూడు వన్డేలు, మూడు టీ20ఐలకు ఎంపిక చేసిన జట్టులోని ఐదు భారీ మార్పులను ఇప్పుడు చూద్దాం.

1 / 6
రవి బిష్ణోయ్, దీపక్ హుడా అరంగేట్రం.. ఇద్దరూ దేశవాళీ క్రికెట్‌లో రాజస్థాన్‌కు ఆడతారు. రవి బిష్ణోయ్ యువ లెగ్ స్పిన్నర్,  అండర్-19 క్రికెట్ నుంచి వెలుగులోకి వచ్చాడు. 2020 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడుతూ మెప్పించాడు. అతడిని ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకుంది. రవి టీ20, వన్డే రెండు జట్లలోనూ సభ్యుడిగా ఉన్నాడు. దీపక్ హుడా చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. కానీ, తొలిసారిగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇటీవల, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ చాలాసార్లు ఒంటరిగా గెలిపించాడు. గతంలో కృనాల్ పాండ్యాతో గొడవ జరిగింది. దీంతో బరోడా జట్టు నుంచి తప్పించారు. రవి మిడిల్ ఆర్డర్‌లో ఆడతాడు. స్పిన్ బౌలింగ్ చేయగలడు.

2 / 6
మరోసారి జట్టులోకి 'కుల్చా'- కుల్దీప్ యాదవ్ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వన్డే జట్టులో సభ్యుడిగా చొటు దక్కించుకున్నారు. గతేడాది అతడిని జట్టు నుంచి తప్పించారు. ఇంతకు ముందు కూడా అతనికి కొన్ని అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత కుల్దీప్ గాయపడ్డాడు. ఇటీవలి కాలంలో టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో కూడా, కుల్దీప్ KKR ప్లేయింగ్ XI నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. యుజ్వేంద్ర చాహల్ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి టీమ్ ఇండియాకు తిరిగివచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి కుల్చా జోడీ టీమిండియాలో కనిపించనుంది. వీరిద్దరూ 2017 నుంచి 2019 ప్రపంచకప్ వరకు భారత్‌కు ప్రధాన స్పిన్నర్లుగా ఉన్నారు.

3 / 6
వన్డేల నుంచి తప్పుకున్న ఇషాన్ కిషన్, వెంకటేష్, భువీ- దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌లో భాగమైన ముగ్గురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఇందులో ఇషాన్ కిషన్, వెంకటేష్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్ పేర్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో భువీ పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు. అదే సమయంలో, వెంకటేష్ కూడా ఫినిషర్ పాత్రలో ముద్ర వేయలేకపోయాడు. ఇక ఇషాన్ విషయానికొస్తే.. ఛాన్స్ కూడా రాలేదు. వన్డేల నుంచి భువీ స్థానం మిస్ అయింది. ఫాస్ట్ బౌలింగ్‌లో భారత్‌కు అనేక ఎంపికలు ఉన్నందున మరో అవకాశం లభించలేదు.

4 / 6
టీ20 నుంచి రితురాజ్, శిఖర్ ధావన్ ఔట్- టీ20 జట్టు గురించి మాట్లాడుతూ, రితురాజ్ గైక్వాడ్‌ను పక్కనపెట్టారు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో అతను అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2021లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలలో కూడా అతని బ్యాట్ నుంచి పరుగులు వచ్చాయి. శిఖర్ ధావన్ గురించి మాట్లాడితే.. అతడి అంతర్జాతీయ టీ20 కెరీర్ ఇక ముగిసినట్లే. 2021 టీ20 ప్రపంచకప్‌కు కూడా అతను ఎంపిక కాలేదు. ఇప్పుడు వెస్టిండీస్‌ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.

5 / 6
అశ్విన్‌పై మౌనం- వెస్టిండీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ల రెండు జట్లలోనూ అశ్విన్ పేరు లేదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇటీవలే భారత వన్డే, టీ20 జట్టులోకి వచ్చాడు. అయితే వెస్టిండీస్ సిరీస్ నుంచి తప్పించారు. అశ్విన్ జట్టులో ఎందుకు లేడనే విషయంపై సెలక్టర్లు ఏమీ చెప్పలేదు. ఇలాంటి పరిస్థితిలో, వారు విశ్రాంతి తీసుకుంటున్నారా లేదా తప్పించారా అనేది స్పష్టంగా తెలియదు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌లో గాయపడ్డట్లు తెలుస్తోంది.

6 / 6
Follow us