Cabbage: క్యాబేజీలో పాలలో ఉన్నంత కాల్షియం.. ఈ 5 సమస్యలకు చక్కటి నివారణ..
Cabbage: క్యాబేజీని సలాడ్లు, సూప్‌లు, చైనీస్ వంటలలో విరివిగా ఉపయోగిస్తారు. ఇందులో పాలతో సమానంగా ఐరన్, పొటాషియం, కాల్షియం ఉంటాయి. ఈ 5 ఆరోగ్య సమస్యలకు చక్కటి నివారణగా ఉపయోగపడుతుంది.
Updated on: Jan 27, 2022 | 7:20 PM

క్యాబేజీలో పాలతో సమానంగా కాల్షియం ఉంటుంది. ఇది మీ ఎముకలను బలపరుస్తుంది. చాలా మంది పాలు తాగడానికి ఇష్టపడరు. అలాంటివారికి క్యాబేజీ మంచి ఎంపిక అవుతుంది.

క్యాబేజీ కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి పనిచేస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కడుపులో నులిపురుగుల సమస్య కూడా నయమవుతుంది.

బరువు తగ్గాలనుకునే వారు క్యాబేజీని ఆహారంలో చేర్చుకోవాలి. ఉడికించిన క్యాబేజీలో 33 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇది మీ శరీరానికి పుష్కలంగా శక్తిని ఇస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. మీరు సూప్, కూరగాయలు, సలాడ్ రూపంలో దీనిని తీసుకోవచ్చు.

క్యాబేజీలో ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో రక్తం లేకపోవడాన్ని తొలగిస్తుంది. బీపీ, గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహకరిస్తుంది.

మీరు కండరాల నొప్పితో బాధపడుతుంటే క్యాబేజీ మీకు చక్కటి ఉపశమనం ఇస్తుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్ అనే మూలకం ఉంటుంది ఇది సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.



