- Telugu News Photo Gallery Viral photos Do you know how much grain need to use for 10 litre beer making know these unknow facts about beer
Beer Making: పది లీటర్ల బీర్ తయారీకి ధాన్యం ఎంత కావాలి.. వ్యర్థాల పరిస్థితి ఏంటి..?
Beer Making: బీర్ తయారు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వివిధ దేశాలు వివిధ పద్దతులను ఉపయోగిస్తాయి. కానీ, కచ్చితంగా ధాన్యం ఉపయోగిస్తారు. బీరు విక్రయాలు
Updated on: Jan 27, 2022 | 7:48 PM

బీర్ తయారు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వివిధ దేశాలు వివిధ పద్దతులను ఉపయోగిస్తాయి. కానీ, కచ్చితంగా ధాన్యం ఉపయోగిస్తారు. బీరు విక్రయాలు పెరగడంతో ఇప్పుడు ధాన్యం వృథా కూడా పెరుగుతోంది. వాస్తవానికి బీర్ ఉత్పత్తిలో చాలా ధాన్యం వ్యర్థాలుగా మారుతుంది.

జపాన్‌లో10 లీటర్ల బీర్‌ను తయారు చేయడానికి 200 కిలోల ధాన్యం వ్యర్థాలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి మీరు ప్రతిరోజూ ఎన్ని బీర్లు తాగుతారో.. ఎంత మొత్తంలో వ్యర్థాలు వెలువడుతాయో ఊహించుకోండి.

ఈ ధాన్యం వ్యర్థాల్లో కొంత భాగాన్ని వ్యవసాయానికి వినియోగిస్తున్నప్పటికీ ఎక్కువ భాగం కాలిపోతోంది. దీని వల్ల పర్యావరణానికి పెను నష్టం వాటిల్లుతోంది.

బీరు తయారీలో ఉత్పత్తయ్యే వ్యర్థాల గురించి ఇప్పుడు చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఆ వ్యర్థాలతో పేపర్‌ను తయారు చేసే పనిలో ఉన్నాయని తేలింది.

జపాన్‌లో చాలా స్టార్టప్‌లు ఈ వ్యర్థాలపై పని చేస్తున్నాయి. ఇవి కాగితం, అనేక రకాల వస్తువులను తయారు చేస్తాయి. వీటిని వినియోగించుకోవాలని ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు.





























