Jaggery Benefits: బెల్లం కంటే చక్కెరంటేనే ఇష్టమా.. అయితే ఇవి తెలుసుకోండి.. మీ మనస్సు మార్చుకుంటారు..
బెల్లం(Jaggery)తో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వైద్యులు సైతం కొంతమంది పేషెంట్లకు షుగర్(Sugar)కు బదులు బెల్లం తీసుకోమని చెబుతుంటారు...

బెల్లం(Jaggery)తో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వైద్యులు సైతం కొంతమంది పేషెంట్లకు షుగర్(Sugar)కు బదులు బెల్లం తీసుకోమని చెబుతుంటారు. బెల్లంతో ఆరోగ్యానికి ఎటువంటి హానీ లేకపోగా.. అందులోని ఔషధ గుణాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఐరన్(Iron), జింక్ కారణంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
ఫుడ్ కెమిస్ట్రీ 2009 అధ్యయనం ప్రకారం బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు సైటోప్రొటెక్టివ్ ఊపిరితిత్తుల నుంచి శ్లేష్మాన్ని తొలగించడమే కాకుండా లోపలి నుంచి శ్వాస కోశ, జీర్ణవ్యవస్థలను శుభ్రపరచడంలో దోహదపడుతుంది. ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా బెల్లం తీసుకుంటే.. అది మీ శరీరం మొత్తాన్ని శుభ్రపరుస్తుంది. భోజనం తర్వాత కొంతమంది బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటారు. అది ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లం జీర్ణాశయంలో ఎంజైమ్‌ల విడుదలకు దోహదపడుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు, మలబద్దక సమస్యలు రాకుండా. బెల్లంలో ఐరన్, పాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
చక్కెరకు బెల్లం ప్రత్యామ్నాయం. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు పెరగడాన్ని, ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెల్లం తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు బెల్లం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Read Also.. Heart: భోజనం చేసిన తర్వాత ఈ పని చేస్తే.. మీ గుండెతో పాటు మీరూ బాగుంటారు..



