Health News: ఈ పండ్లలో చికెన్, మటన్ కంటే ఎక్కువ పోషకాలు.. కచ్చితంగా డైట్‌లో ఉండాల్సిందే..!

Health News: ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తినాల్సిందే. ఎందుకంటే శరీరానికి ప్రొటీన్ చాలా ముఖ్యం. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లలో ఇది ఎక్కువగా లభిస్తుంది. మరోవైపు

Health News: ఈ పండ్లలో చికెన్, మటన్ కంటే ఎక్కువ పోషకాలు.. కచ్చితంగా డైట్‌లో ఉండాల్సిందే..!
Fruits
Follow us
uppula Raju

|

Updated on: Mar 17, 2022 | 5:54 AM

Health News: ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తినాల్సిందే. ఎందుకంటే శరీరానికి ప్రొటీన్ చాలా ముఖ్యం. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లలో ఇది ఎక్కువగా లభిస్తుంది. మరోవైపు నాన్ వెజ్ తినే చాలా మంది ప్రోటీన్ కోసం చికెన్, గుడ్డును ఉపయోగిస్తారు. ఎందుకంటే చికెన్, చేపలు, గుడ్లలో ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అయితే నాన్‌ వెజ్‌ తినని వ్యక్తులు కొన్ని పండ్లని తీసుకుంటే చికెన్, మటన్‌లో ఉండే ప్రొటీన్స్‌ లభిస్తాయి. నారింజ, బ్లాక్‌బెర్రీ, జాక్‌ఫ్రూట్, నేరేడు పండు, కివీ, అవకాడోలో తగినంత ప్రొటీన్‌ లభిస్తుంది. మీరు శరీరంలో ప్రోటీన్ పరిమాణం తక్కువగా ఉందని భావిస్తే వీటన్నిటిని డైట్‌లో చేర్చుకోండి. కచ్చితంగా రోగనిరోధక శక్తి పెరిగి బలంగా తయారవుతారు. శరీర కణాల పెరుగుదల, మరమ్మతు కోసం ప్రోటీన్ చాలా అవసరం. మాంసకృత్తులు, చేపలు, పేడి , కాయ ధాన్యాలు బీన్స్, టోఫు మొదలైన వాటిలో ప్రోటీన్ మనకి లభిస్తుంది. తగినంత ప్రోటీన్ కనుక లేక పోతే తక్కువ పెరుగుదల, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ కి దారి తీస్తుంది. అలానే అధిక ప్రోటీన్లు వల్ల బరువు పెరగడం కాలేయ సమస్యలు కూడా వస్తాయి.

అలాగే చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయి. శాఖాహారులు ప్రోటీన్స్ కోసం వీటిని తీసుకోవడం చాలా మంచిది. ప్రతి రోజు రెండు టేబుల్ స్పూన్స్ ఓట్స్ లో లేదా పుడ్డింగ్ లో వేసుకుని తీసుకోవడం వల్ల మీకు మంచి ప్రోటీన్, ఫైబర్ అందుతుంది. చియా సీడ్స్ వల్ల 7 గ్రాముల ప్రోటీన్స్, 12 గ్రాముల కార్బోహైడ్రేట్స్ అందుతాయి. పిస్తా తీసుకోవడం వల్ల మీకు మంచి ప్రోటీన్స్ వస్తాయి. మీరు దీనిని స్నాక్స్ కింద కూడా తీసుకో వచ్చు. పిస్తా వల్ల మీకు ఎనిమిది గ్రాముల ప్రోటీన్, ఎనిమిది గ్రాముల కార్బోహైడ్రేట్స్ వస్తాయి.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Kaloji University: వైద్య విద్యార్థులకు గమనిక.. కాళోజీ యూనివర్సిటీ నుంచి యాజమాన్య కోట్ల సీట్ల భర్తీకి నోటిఫికేషన్

Viral Photos: పదకొండేళ్ల పిల్లాడు తన పేరుపై భూమిని కొన్నాడు.. కారణం ఏంటో తెలుసా..?

ఆపిల్ యాప్ స్టోర్ రష్యాలో 7 వేల యాప్‌లను కోల్పోయింది.. ఎందుకో తెలుసా..?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..